చెత్తకుప్పలో నగదు
అన్నానగర్: చైన్నె సమీపం వేలచ్చేరిలోని అన్నా వీధిలోని నెహ్రూ నగర్‌లో రోడ్డు పక్కన చెత్త సంచులను వేస్తున్నారు. గురువారం ఒక పారిశుధ్య కార్మికుడు చెత్తను సేకరించడానికి వచ్చినప్పుడు, అక్కడ 2 సంచులు ఉన్నాయి. అతను వాటి తెరిచి చూసేసరికి, వాటిలో రూ. 2000, రూ.500 నోట్లు కట్టకట్టలుగా ఉండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే వేలచ్చేరి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి నోట్లు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ బ్యాగుల్లో ఉన్న రూ.2000, రూ.500 నోట్లు మంచి నోట్లా లేక నకిలీ నోట్లా అని వారు విచారించారు. దర్యాప్తులో అవి సినిమా ఘాటింగ్ లకు ఉపయోగించే నకిలీ నోట్లు అని తేలింది. అయితే, ఆ డబ్బును చెత్తలో ఎవరు విసిరారోనని పోలీసులు విచారిస్తున్నారు.


