కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం

తిరుత్తణి: కాంగ్రెస్‌ నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన శశికుమార్‌కు తిరుత్తణి పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికలు పురష్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే విధంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. తిరువళ్లూరు పడమర జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది శశికుమార్‌ను నియమించారు. ఇతను బుధవారం తిరుత్తణిలో పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయలన పార్టీ పట్టణ కార్యకర్తలను పరిచయం చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని నూతన జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలకు సూచించారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, ఆర్కేపేట సహా పలు ప్రాంతాలకు వెళ్లి మండల, పట్టణ పార్టీ శ్రేణులను కలుసుకుని పరిచయం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement