ఫిర్యాదులపై విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై విచారణ జరిపించాలి

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

ఫిర్యాదులపై విచారణ జరిపించాలి

ఫిర్యాదులపై విచారణ జరిపించాలి

వేలూరు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అదనపు ఎస్పీ భాస్కరన్‌ ఆదేశించారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మయిల్‌వాగనన్‌ అధ్యక్షతన ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్‌ సీఐలకు అందజేసి వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే 15 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. వీటిపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఎక్కువగా చీటీల పేరుతో పలువురు మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం నేడు వచ్చిన మొత్తం 30 ఫిర్యాదులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు ఫిర్యాదులను పంపారు. డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement