చివరి షెడ్యూల్‌ కోసం కేరళకు.. | - | Sakshi
Sakshi News home page

చివరి షెడ్యూల్‌ కోసం కేరళకు..

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

చివరి షెడ్యూల్‌ కోసం కేరళకు..

చివరి షెడ్యూల్‌ కోసం కేరళకు..

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో కన్నడ నటులు శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాప్‌, తెలుగు నటుడు సునిల్‌ ప్రత్యేక పాత్రల్లో నటించారు. తమన్నా ప్రత్యేక పాటలో నటించి ఆ చిత్ర విజయానికి కారణంగా మారారు. తాజాగా ఈచిత్రానికి సీక్వెల్‌గా జైలర్‌–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మింస్తున్న ఈ చిత్రంలోనూ శివకుమార్‌ నటిస్తున్నారు. ఎస్‌జే.సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జైలర్‌ 2 చిత్రం ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుని చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ను కేరళాలో చిత్రీకిస్తు న్నారు. ఇందుకోసం రజనీకాంత్‌ కేరళకు బలుదేరారు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అది చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్ర విజయం రజనీకాంత్‌కు చాలా అవసరం. ఎందుకంటే జైలర్‌ తరువాత ఇప్పటి వరకు ఆయన నటించిన ఏ చిత్రమూ సక్సెస్‌ కాలేదు. జైలర్‌–2 చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌ 12న విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రం పూర్తి చేసిన తరువాత సిబి చక్రవర్తి దర్శకత్వంలో నటించడానికి రజనీ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పిలిం పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

జైలర్‌–2లో రజనీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement