మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల శిబిరానికి పోలీస్ కమిషనర్ అరుణ్ హాజరయ్యారు. మహిళల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. చైన్నె వేపేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి బుధవారం సాధారణ ప్రజల కోసం ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఆమేరకు బుధవారం జరిగిన ఫిర్యాదుల పరిష్కార వేదికలో వృద్ధులు, మహిళలు సహా అనేక మంది పాల్గొన్నారు. ఈ వేదికలో పోలీస్ కమిషనర్ అరుణ్ పాల్గొన్నారు. శిబిరంలో మహిళలు, వృద్ధుల నుంచి విడివిడిగా ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆరోగ్యం హాజరయ్యారు. అదేవిధంగా, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ రేంజ్‌లోని 12 మంది డిప్యూటీ కమిషనర్లు వారి కార్యాలయాలలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.


