సంగీతం కోసం పీఎస్‌ఆర్–ఐ సిరీస్
సాక్షి, చైన్నె : సంగీతకారులు, అభ్యాసకులు, ప్రదర్శకులు అంటూ భారతీయ సంగీత ప్రపంచం కోసం యమహా మ్యూజిక్ ఇండియా కొత్త పీఎస్‌ఆర్–ఐ సిరీస్‌ను పరిచయం చేసింది. చైన్నె వేదికగా బ్రహ్మాండ సంగీత మహోత్సవ వేదికగా పీఎస్‌ఆర్–ఐ, పీఎస్‌ఆర్–ఐ 610, పీఎస్‌ఆర్–ఐ 510 పేరిట వైవిధ్యమైన సంగీత సంస్కృతిని పెంపొందించే విధంగా పోర్టబుల్ కీ బోర్డులను నవతరానికి అనుగుణంగా విడుదల చేశారు. భారతీయ శాసీ్త్రయ శిక్షణ, సమకాలీన ప్రదర్శన, హైబ్రిడ్ భారతీయ– పాశ్చాత్య సంగీత శైలిలకు మద్దతుగా వీటిని తీర్చిదిద్దారు. భారతీయ స్వరాలు, శైలులు, అధిక నాణ్యత సంగీత సృష్టిని అందుబాటులోకి కొత్త సృజనాత్మక అంశాలతో పరిచయం చేశారు. యమహా మ్యూజిక్ ఇండియా యూనిట్ హెడ్ రియోజి మారుయమా, డీజీపీఎం రెహ్మాన్ సిద్ధిఖి, మేనేజర్ కజుకి వటనాబే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఇండియన్ కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, సౌండ్ ఇంజినీర్ గుల్‌రాజ్ సింగ్, మ్యూజిక్ ఎడ్యుకేటర్, ప్రొఫెషనల్ కీ బోర్డిస్టు అలన్ ప్రీతం మ్యూజిక్ అండ్ కంపోజింగ్ ప్రదర్శన అదరహో అనిపించే విధంగా జరిగింది. ఈసందర్భంగా ఈ ఇద్దరిని యమహా ప్రతినిధులు సత్కరించారు.


