క్లుప్తంగా
రేబిస్‌తో విద్యార్థి మృతి
అన్నానగర్: రేబిస్‌తో బాధపడుతూ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు..వాలాజాబాద్ సమీపం చిన్నివాక్కంకు చెందిన భాస్కర్ కుమారుడు శబరివాసాన్ (15) 9వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలల క్రితం, శబరివాసన్ తన ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటుండగా, అదే ప్రాంతంలో ఒక కుక్క అత డిని కరిచింది. తండ్రికి ఈ విషయం చెప్పలేదు. చివరకు ఆలస్యంగా ఆస్పత్రికి చికిత్స పొందాడు. అయితే అప్పటికే అతడికి రేబిస్ సోకింది. ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తొలుత చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ, చికిత్స పొందుతూ శబరివాసన్ బుధవారం మరణించాడు. కుక్క కరిచిన 3 నెలల తర్వాత విద్యార్థి మరణించిన సంఘటన చర్చనీయాంశమైంది.
పసికందు విక్రయం
అన్నానగర్: కన్నబిడ్డను విక్రయించిన ఓ తల్లిని, దీనికి సహకరించిన మరో నలుగురు మహిళలను కాసిమేడు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కాశిమేడు, పవర్ కుప్పం 2వ బ్లాక్‌కు చెందిన సహాయరాజ్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మా యి సంతానం. అతడి భార్య తిలగవతి మళ్లీ గర్భం దాల్చి గత నెల 4న ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమె తన బిడ్డను ఎవరికై నా విక్రయిస్తానని తండయార్ పైట్టెకి చెందిన ప్రదీపకు చెప్పింది. ఆ తర్వాత ప్రదీప, కాసిమేడుకు చెందిన వెన్నిల పుదువన్నరాపేట్టైకి చెందిన కౌసల్య ఈరోడ్‌కు చెందిన పిల్లలు లేని ఓ మహిళకు రూ.3.80లక్షలకు విక్రయించారు. సమాచారం అందుకున్న కాసిమేడు పోలీసులు తిలగవతితో సహా అమ్మకానికి సహకరించిన మహిళలను అరెస్ట్ చేశారు. శిశువును రాయపురంలోని శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. నిందితులు గతంలో ఎక్కడైనా శిశువులను విక్రయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చైన్నెలో ఈ ఘటన కలకలం సృష్టించింది.
మద్యం మత్తులో దాడి
యువకుడి మృతి
తిరువొత్తియూరు: చైన్నె గూడువాంచేరి సమీపంలోని ఊరపాక్కం, చెల్లియమ్మన్ కోయిల్ వీధికి చెందిన కార్తీక్ (40) గత 17వ తేదీ రాత్రి కానుం పొంగల్ (సంక్రాంతి)పండుగను జరుపుకోవడానికి ఐదుగురు స్నేహితులతో కోవలం బీచ్‌కు వచ్చాడు. అక్కడ అందరూ మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో సర్ఫింగ్ సెంటర్ (అలల పలక ) మీదుగా బీచ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కణ్ణన్ వారిని ప్రశ్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది. అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన అజీస్ (27), కార్తీ (25) అనే మరో ఇద్దరు యువకులు వచ్చారు. అనంతరం ఇరువర్గాల పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని స్నేహితులు అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం అతడు మరణించాడు. కేళంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి, కార్తీక్‌పై దాడి చేసిన కోవలం, భజన కోయిల్ వీధికి చెందిన కణ్ణన్ (38), చైన్నె ట్రిప్లికేన్, నడుకుప్పంకు చెందిన అజీస్, మామల్లాపురం జలార్లు ప్రాంతానికి చెందిన కార్తీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
భారత్ బోధన్ ఏఐ కాన్ క్లేవ్
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు నేతృత్వంలో భారత్ బోధన్ ఏఐ కాన్ క్లేవ్ 2026లో పాల్గొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యా భవిష్యత్తును రూపొందించడానికి , పరిశోధన ఆధారిత ఏఐ పరిష్కారాల కోసం ఈ కాన్ క్లేవ్ నిర్వహించనున్నారు. దీనిలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 29 వరకు తమ పేర్లను బోధన్ ఏఐ కాన్ క్లేవ్ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని ఐఐఐటీ మద్రాసు బుధవారం ప్రకటించింది.
నేడు రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ పనిచేయదు
తిరువొత్తియూరు: నేడు రిజిస్ట్రేషన్ పని చేయదని పత్రాల నమోదు శాఖ డైరెక్టర్ దినేష్ పొన్రాజ్ ఆలివర్ ఒక ప్రకటన విడుదల చేశా రు. అందులో వివరాలు ఇలా.. పత్రాల నమో దు శాఖ వెబ్‌సైట్ httpr://tnrefinet.gov.inనిర్వహణ స్టార్ 3.0 ప్రాజెక్ట్ కోసం అప్‌గ్రేడ్ చేస్తున్నందన, నేడు బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువా రం ఉదయం 11 గంటల వరకు నమోదు శాఖ వె బ్‌సైట్ పనిచేయదు. అయినప్పటికీ, పైన పేర్కొ న్న 2 రోజుల్లో అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల లో నమోదు పనులు యథావిధిగా జరుగుతాయి. నేడు పత్రాలు నమోదు చేసుకోవాలనుకునే ప్రజ లు, వెబ్‌సైట్ నిర్దిష్ట సమయంలో పనిచేయదని దృష్టిలో ఉంచుకుని, బుధవారం రాత్రి 7 గంటలలోపు టోకెన్లు తీసుకోవడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం, ఈసీ , సర్టిఫైడ్ డాక్యుమెంట్ కాపీలను పొందడం వంటి నమోదు శాఖ వెబ్‌సైట్ సేవలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని సూచించడమైనదని పేర్కొన్నారు.
వరసిద్ధునికి విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు శ్రీరంగరాజుపురానికి చెందిన నాగభూషణమ్మ, చెంగారెడ్డి చెరో రూ.50వేల చొప్పున విరాళం అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో రవీంద్రబాబు, సిబ్బంది వాసు, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


