మంత్ర పూజలు చేశారని ఫిర్యాదు
వేలూరు: పాత కక్షల నేపథ్యంలో తమ ఇంటి వాకిలి ముందు మూడు చోట్ల కోడి గుడ్లు పెట్టి మాంత్రీకం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని పాండియన్ నగర్‌లోని పిల్లయార్ ఆలయ వీధికి చెందిన ఒక కుటుంబానికి పొరుగింటి వారితో పాతకక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మంత్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో ఆందోళన చెందారు. ఇంటి ముందు ఉన్న సీసీ టీవీ కెమెరాను పరిశీలించగా, పొరుగింటి వారే అర్ధరాత్రి పూట ఇలా చేశారని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.


