ఆయిల్‌ ట్యాంకర్‌–లారీ ఢీ: డ్రైవర్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌–లారీ ఢీ: డ్రైవర్‌కు గాయాలు

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

ఆయిల్

ఆయిల్‌ ట్యాంకర్‌–లారీ ఢీ: డ్రైవర్‌కు గాయాలు

బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్‌ చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌ గాయపడ్డాడు. పోలీసుల కథనం.. పలమనేరు నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను మొగిలి ఘాట్‌ వద్ద వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరణి పట్టణం సూర్యకులుకి చెందిన లారీ డ్రైవర్‌ కన్నన్‌ కాలుకి తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్‌ను హైవే అంబులెన్సులో బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. లారీకి బ్రేక్‌ కంట్రోల్‌ కాకపోవడం కారణంగా ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ట్యాంకర్‌ను ఢీకొనడంతో దెబ్బతిన్న లారీ ముందు భాగం,గాయపడిన లారీ డ్రైవర్‌ కన్నన్‌

ఆయిల్‌ ట్యాంకర్‌–లారీ ఢీ: డ్రైవర్‌కు గాయాలు1
1/1

ఆయిల్‌ ట్యాంకర్‌–లారీ ఢీ: డ్రైవర్‌కు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement