జేబు దొంగ అరెస్టు
తిరుమల: శ్రీవారి భక్తుల్ని మోసగించి జేబుల్లోని వస్తువులను చోరీ చేస్తున్న వ్యక్తిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌ఐలు రమేష్, చలపతి తెలిపారు. ఎస్‌ఐల కథనం మేరకు.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం కంపార్ట్‌మెంట్ 19లో ఓ మహిళ భక్తురాలి జేబులో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారి కుటుంబసభ్యుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రెడ్డెప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21వ తేదీన ఆస్థాన మండపం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడుకు చెందిన శివయ్య అలియాస్ శివ(55)గా గుర్తించామని ఎస్‌ఐలు తెలిపారు. క్యూలోని భక్తుల జేబుల్లో చోరీకి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 56 గ్రాముల బంగారం, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితుని రిమాండ్‌కు తరలించామన్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారం


