శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు | - | Sakshi
Sakshi News home page

శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు

శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు

సాక్షి, చైన్నె : చిన్నారులకు శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డును మద్రాస్‌ ఈఎన్‌టి రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సృష్టించింది. బుధవారం మద్రాసు ఈఎన్‌టీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ కామేశ్వరన్‌ ఈ వివరాలను ప్రకటించారు. 2004లో మొదటిసారిగా 13 ఏళ్ల బాలికకు ఆడిటరీ ట్రెయిన్‌ ప్రైమ్‌ ఇంప్లాంట్‌ (ఏబీఐ) చికిత్సను నిర్వహించి వినికిడిని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 2009లో పసికందు కూడా చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 100 వరకు ఆ రకమైన చికిత్స విజయవంతంగా చేసి, కొత్త మైలురాయికి చేరామని వెల్లడించారు. సమావేశంలో వీహెచ్‌ఎస్‌ హాస్పిటల్‌ చీఫ్‌ న్యూరో సరైన్‌ డాక్టర్‌ ఎంసీ వాసుదేవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement