క్లుప్తంగా
వేణుగోపాలస్వామి
అలంకరణలో వీరరాఘవుడు
తిరువళ్లూరు: వీరరాఘవుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం ఉదయం స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత వైద్య వీరరాఘవుడు వేణుగోపాలస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వైద్య వీరరాఘవుడి ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారు వేణగోపాల స్వామి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఏడవ రోజు బుధవారం ఉదయం స్వామి వారి రథోత్సవం జరగనుంది.
ఆటో మోటివ్‌లోకి శిల్పకళ
సాక్షి, చైన్నె : కోచర్ పెన్సిబిలిటీలను ఆటోమోటివ్ రంగంలోకి తీసుకొస్తూ, కోచర్, శిల్పం, సమకాలీ న చేతి వృత్తిని ప్రోత్సహించేందుకు గౌరవ్ గుప్తా తో ఎంజీ సెలక్ట్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంజీ సైబర్ స్టర్ ఏకై క కళాత్మక వివర ణను తద్వారా ముందుకు స్థానికంగా మంగళవా రం తీసుకొచ్చారు. డిజైనర్, ఫ్యాషన్, కళ, ఆటోమోటివ్ డిజైన్‌ను కలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సహకారం ప్రధానంగా ఎంజీ సైబర్ స్టర్‌కు కొత్త రూపంగా మలిచారు. ఆరు నెలల పా టుగా సృజనాత్మక తత్వ శాస్త్రం, శిల్ప కళా వస్తువు గా మార్చేందుకు హస్త కళ, పారిశ్రామిక ఆవిష్కరణలు, ఆర్ట్ నోయివేలైన్స్ ద్వారా వేగంగా ప్రేరణ పొందిన రూపంగా, కదిలా కళాకృతిగా తీర్చిదిద్దారు.గౌరవ్ గుప్తా జీవంపోసిన ఈ కారు కళాకృతి, సిగ్నేచర్ విజువల్ ఐడెంటిటీని, ఎంబ్రాయి డరీ ప్రత్యేక ఆకర్షనగా ప్రకటించారు. ఈ విష యంగా డిజైనర్ గౌరవ్ గుప్తా, ఎంజీ సెలక్ట్ తా త్కాలిక అధ్యక్షుడు మిలింద్ షాలు పేర్కొంటూ, ఆటో మోటివ్ ఇంజనీరింగ్, సమకాలీన జీవన శైలి మధ్య వారధిగా ఈ భాగస్వామ్యం మారిందన్నారు. సాంప్రదాయ భారతీయ ఎంబ్రాయిడరీ , అలకరణల అంశంగా, అధునాతన సాంకేతికతతో విలీనం చేశామని వివరించారు.
లారీని ఢీకొన్న బైక్
–ఇద్దరు యువకుల దుర్మరణం
తిరువొత్తియూరు: లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కాంచీపురం జిల్లా తిరుపెరుంబుదూర్ సమీపంలోని పన్రుట్టి గ్రామం తోపు వీధికి చెందిన మహేంద్రన్ (19), బాలమురుగన్ (19) ఓరగడంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం యథావిధిగా పనికి వెళ్లారు. పనిముగించుకుని రాత్రి 8 గంటలకు బైక్‌లో పన్రుట్టి వైపు వెళ్తున్నారు. అదేసమయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన లారీ రోడ్డు దాటుతుండగా అదుపుతప్పిన బైక్ లారీని ఢీకొంది. ఈప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలిసి ఓరగడం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపెరుంబుదూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నేడు విద్యుత్ అంతరాయం ఉండే ప్రాంతాలు
తిరువొత్తియూరు: చైన్నెలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వి ద్యుత్ శాఖ నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్రా ంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాంతాల వివరాలు..
లక్ష్మీనగర్ ప్రాంతం: ఎస్బీఐ కాలనీ 3వ జయంతి నగర్, ఉళ్ళగరం, ఆళ్వార్ నగర్, మాక్‌మిల్లన్ కాలనీ, పెరుమాళ్ నగర్, ఎస్బీఐ కాలనీ, కన్నయ్య వీధి, కుళక్కరై వీధి, కపిలర్ వీధి, కాలేజ్ రోడ్ 4వ ప్రధాన వీధి, హిందూ కాలనీ, జోసెఫ్ వీధి, కుప్పుసామి వీధి, గోవిందసామి వీధి, గాంధీ రోడ్, ఎల్లైముత్తమ్మన్ కోయిల్ వీధి, కుమరన్ వీధి, చర్చ్ వీధి, కృష్ణసామి వీధి, మూవరసంపేట్టై, పల్లవన్ తాంగల్.
నంగనల్లూర్: పీవీ నగర్, ఎంజీఆర్ రోడ్, కనకం కాలనీ, పాల్ విశ్వనాథపురం, హిందూ కాలనీ, ఎన్జీఓ కాలనీ, కేకే నగర్, టీచర్స్ కాలనీ, ఎస్బీఐ కాలనీ విస్తరణ, ఎస్బీఐ కాలనీ ప్రధాన రోడ్, ఏజీఎస్ కాలనీ, దురైసామి గార్డెన్, 100 అడుగుల రోడ్ ప్రాంతం, సివిల్ ఏవియేషన్ కాలనీ, వోల్టాస్ కాలనీ, అయ్యప్ప నగర్, కన్నికా కాలనీ, నెహ్రూ కాలనీ, కాలేజ్ రోడ్, వేంపులి అమ్మన్ వీధి, గాంధీ రోడ్.
చైన్నె శివారులోని ఇతర ప్రాంతాలు: దక్షిణ టెలిఫోన్ కాలనీ, ఏవీఎం నగర్, వసంతం అవెన్యూ, జేజే నగర్, కష్ణ నగర్, ఈశ్వరి నగర్, ఎంసీఆర్ నగర్, తిరుమురుగన్ నగర్, దివేలన్ వీధి, తెలుగు కాలనీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండనున్నాయి.
300 పాఠశాలల్లో కూల్ రూఫ్‌ల ఏర్పాటుకు చర్యలు
– చైన్నెలో మంత్రి తంగం తెన్నరసు
కొరుక్కుపేట: వేసవిలో ఎండవేడిమిని తట్టుకునేందుకు తమిళనాడు అంతటా 300 గ్రీన్ పాఠశాలల్లో కూల్ రూఫ్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ వేడి ఒత్తిడి వల్ల చదువులో ఏకాగ్రత దెబ్బతింటుందని, వేసవిలో కాంక్రీట్ పైకప్పులతో కూడిన ఉన్నత పాఠశాలల్లో ఇండోర్ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకుంటాయన్నారు. ఇది విద్యార్థుల ఏకాగ్రత పని తీరును ప్రభావితం చేస్తుందని అధ్యయనాల ద్వారా వెల్లడైందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2025–26లో ప్రభుత్వం కింద తమిళనాడు వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కూల్‌రూఫ్‌లను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీనిని అంబత్తూర్ హైస్కూల్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. రూఫ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత, ఇండోర్ ఉష్ణోగ్రత సగటున భారీగా తగ్గిందన్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్‌ల అవసరం కూడా తగ్గిందన్నారు. దీంతో 300 పాఠశాలల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


