పౌష్టికాహార కార్మికుల రాస్తారోకో
వేలూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తమిళనాడు పౌష్టికాహార కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏలుమలై అధ్యక్షత వహించగా తమిళనాడు ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి జనార్దన్ మాట్లాడుతూ పౌష్టికాహార కార్మికులకు గత 2021వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్టికల్ 313లో పేర్కొన్న విధంగా తమకు సాధారణ వేతనాలు, కటుంబ భద్రతతో కూడిన పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.5 లక్షలు గ్రాట్యుటీ, వంట సహాయకులకు రూ.3 లక్షలు ఇప్పించాలనే డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని విధులకు హాజరు కామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేయకుండా కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేయడంతో పోలీసులు 700 మంది కార్మికులను అరెస్ట్ చేసి ప్రయివేటు కల్యాణ మండపంలో ఉంచారు. రాస్తారోకోలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుక్మణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణమూర్తి, కార్మికులు మరగదం, తమిల్‌సెల్వి, మహేశ్వరి, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. పౌష్టికాహార ఉద్యోగులకు క్రమబద్ధీకరించిన వేతనాలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. అయితే ఇంతవరకు వారి సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలోనే పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆందోళనకు నేతృత్వం వహించిన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇళంగోవన్ మాట్లాడుతూ పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిషరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగుల అరెస్టు చేస్తున్న పోలీసులు
రాస్తారోకో చేస్తున్న ఉద్యోగులు
పౌష్టికాహార కార్మికుల రాస్తారోకో
పౌష్టికాహార కార్మికుల రాస్తారోకో


