వార్షికోత్సవం
శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ 20వ వార్షికోత్సవ వేడుకను మంగళవారం నిర్వహించారు. బెంగళూరులోని ఇండియన్ మాంటిస్సోరి సెంటర్ అధ్యక్షురాలు ఉమా శంకర్ ఈసందర్భంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లలతో ముచ్చటించారు. ఆ విద్యా సంస్థ వీసీ ఉమా శేఖర్, డీన్ కె బాలాజీ సింగ్, ఆ సర్జరి విభాగం అధిపతి ఎస్ ప్రసన్నకుమార్, ఆడియాలజీ , స్పీచ్ ల్యాంగ్వేజ్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాశ్ భూమినాథన్, స్పెసల్ ఆఫీసర్ రూప నాగరాజన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.
– సాక్షి, చైన్నె
వార్షికోత్సవం


