భక్తిశ్రద్ధలతో వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవం
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్‌లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా మంగళవారం ఉదయం 8:55 గంటలకు వాసవాంబ అమ్మవారికి పూజ, హోమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం శ్రీ వాసవాంబాకు క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే శ్రీ వాసవాంబను విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలను ఆలయ అర్చకులు భాస్కర్ పంతులు బందం వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి దీపారాధన నేత్రపర్వంగా నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ వేడుకలలో ఆలయ పాలకమండలి సభ్యులు, మాజీ సభ్యులు పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.శ్రీ వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు.
ఆత్మార్పణ దినోత్సవంలో ఆలయ పాలకమండలి సభ్యులు
ఆలయంలో హోమ పూజలు
భక్తిశ్రద్ధలతో వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవం


