మర్యాదపూర్వక కలయిక
సాక్షి, చైన్నె: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై న నితిన్ నబిన్‌తో మంగళవారం బీజేపీ రాష్ట్రవ్యవహారాల కో– ఇన్‌చార్జ్ పి సుధాకర్‌రెడ్డి బేటీ అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినానంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తులు, సీట్ల కసరత్తుల గురించిన వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
యూట్యూబర్‌ను
అరెస్టు చేయాలి
కొరుక్కుపేట: దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ అమలు చేసిన పథకాల గురించి తప్పుగా మాట్లాడిన యూట్యూబర్ ముక్తార్ అహ్మద్‌ను అరెస్ట్ చేయాలని ఆందోళనకు నాడార్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. తమిళనాడు నాడార్ ఫెడరేషన్ తరఫున చంద్రన్ జయపాల్ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం మంగళవారం జరిగింది. వారు ఆందోళన చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డగించడంతో, వారు రోడ్డు మధ్యలో బైఠాయించి గొడవకు దిగారు.ఆందోళనలో ఇండియన్ నాడార్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.టి. పద్మనాభన్, తమిళ విప్లవానికి కలాం వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టివాకం ఎ. మురుగన్, తమిళనాడు క్షత్రియ నాడార్ మూమెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.సి.రాజా, ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రన్ జయపాల్, తమిళనాడు నాడార్ అసోసియేషన్‌న్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిన్నల్ హెచ్. స్టీఫెన్, తమిళనాడు నాడార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. ముత్తు రమేష్ ఆందోళనలో పాల్గొన్నారు.పోలీసులు నాడార్ ఫెడరేషన్ సభ్యులను అరెస్టు చేశారు


