అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్
చైన్నె శివారులోని సెమ్మంజేరిలో రూ. 260 కోట్లలో క్రీడా నగరం ఏర్పాటుకు నిర్ణయం.
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 12.16 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ప్రయోజనాలను కల్పిస్తూ అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పథకం గురించి వివరించారు.
మహిళా పథకం కోసం రూ. 33,464 కోట్లు కేటాయింపు.
గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పునకు వ్యతిరేకత. పని దినాల పెంపునకు డిమాండ్.
మీతో స్టాలిన్ కార్యక్రమంలో వచ్చిన 36.62 లక్షల విజ్ఞప్తులకు పరిష్కారం
చైన్నెలో రూ. 83 కోట్లతో టెక్ సిటీ ఏర్పాటు. గిండిలో 118 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పార్క్ నిర్మాణం.
385 మంది ఆది ద్రావిడ గిరిజన విద్యార్థులకు రూ.162 కోట్ల స్కాలర్‌షిప్.
10 లక్షల మంది విద్యార్థులకు రూ. 2172కోట్లతో ల్యాప్‌టాప్‌లు.
రూ.3,112 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుల అమలు.
మహిళా స్వయం సంఘాలకు లక్షా 34 కోట్ల రుణాల పంపిణీ.
ఉచితవ్యవసాయ విద్యుత్‌కు రూ.26723 కోట్లు ఐదు సంవత్సరాలలో కేటాయింపు.
41 వృత్తి శిక్షణా కేంద్రాల ఏర్పాటు, ఇక్కడ శిక్షణ పొందిన వాఇరలో 3 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కేటాయింపు
గత నాలుగు సంవత్సరాలలో 2.86 లక్షల హెక్టార్ల భూముల పరిరక్షణ.
రూ. 8911 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి.
ద్విభాషా విద్యా విధానానికే మొగ్గు. మూడో భాషకు చోటు లేదని స్పష్టీకరణ.
మహిళా సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులు అన్నీ రాష్ట్ర సొంత నిధులతోనే అమలు .
రూ.2,648 కోట్లతో కలైంజ్ఞర్ అర్భన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలు – హిందూ దేవాదాయ శాఖకు చెందిన 8 వేల కోట్ల విలువైన 8,073 ఎకరాల భూములు స్వాధీనం.
తమిళనాడులోని 14 జిల్లాలో కొత్త టైడల్ పార్కులు.
చిరుధ్యాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రకటన
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : అందరూ ఊహించినట్టే అసెంబ్లీలో గవర్నర్ తన వివాదాస్పద ధోరణిని మరో మారు చాటుకున్నారు. 2023లో తొలిసారి ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టిన గవర్నర్, 2024లో ప్రసంగంలోని తొలి, చివరి పేజీని చదవి మమా అనిపించారు. 2025లో జాతీయ గీతం ముందుగా ఆలపించాలని పట్టుబడుతూ ప్రసంగాన్ని పక్కన పెట్టి సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఈ సారి కూడా ఆయన అదే ధోరణితో ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. 2026 కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ మంగళవారం సమావేశమైంది. ప్రభుత్వ ప్రసంగం పాఠాన్ని ఈసారి కూడా గవర్నర్ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా వెలువడ్డే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు ఆయన సభకు రాగానే, స్పీకర్ అప్పావు ఆహ్వానించారు. తమ దివంగత నేత కరుణానిధి జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. సభలోకి గవర్నర్ వెళ్లగానే, ప్రత్యక్ష ప్రసారాలు, మీడియాకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. ఇందుకు కారణం గతంలో సభలో చోటు చేసుకున్న పరిణామాలే. దీంతో గవర్నర్ అటు సభలోకి వెళ్లి, ఇటు బయటకు వచ్చేశారు.
లోక్‌భవన్.. 13 కారణాలతో ప్రకటన
గవర్నర్ సభలో ప్రసంగం పాఠం పక్కన పెట్టడానికి 13 కారణాలను లోక్ భవన్ ప్రకటన రూపంలో వివరించింది. గవర్నర్ మైక్రోఫోన్(మైక్) పదే పదే ఆగి పోయిందని, ప్రసంగంలో అనేక తప్పుడు సమాచారాలు, నిరాధారమైన వాదనలు ఉన్నట్టు, తమిళనాడులోకి రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్న సమాచారం పూర్తిగా అసత్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో లైంగిక వేదింపు కేసులు, హత్యలు, దోపిడీ వంటి నేరాలు పెరిగాయని, మహిళలకు భద్రత కరువైందని, విద్యార్థులు, అన్ని వర్గాలు మత్తుకు బానిసయ్యే పరిస్థితి ఉందని ఆరోపించారు. భక్తుల మనో భావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు, రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ వ్యవహారాలు సాగుతున్నట్టు, నిరుద్యోగం పెరిగినట్టు పేర్కొంటూ, మళ్లీ జాతీయ గీతాన్ని అవమానించారని అందులో వివరించారు.
గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం
శాసన సభలో గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ తీర్మానం తీసుకొచ్చారు. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించి సభ నుంచి ఆయన వాకౌట్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని, దీనిని గవర్నర్ ఆమోదిస్తారని పేర్కొంటూ, ఈ ప్రసంగం తప్పక చదవాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. అయితే, గవర్నర్ తన సొంత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారని మండిపడుతూ, దివంగత నేత అన్నాదురై వ్యాఖ్యలను ఈసందర్భంగా ఉటంకిస్తూ తమిళ ప్రజల సంక్షేమం, మనో భావాలను వివరించారు. గవర్నర్ తీరు ఆమోద యోగ్యం కాదని, శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న అసెంబ్లీ ఖ్యాతిని పరిరక్షించేందుకు ఈ తీర్మానం అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విధానాలను అనుసరించి, తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి అసెంబ్లీకి పంపిందని, దీనిని గవర్నర్ విస్మరించడాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగంలోని ఆంగ్ల పాఠం సభ్యుల డెస్క్‌పై ఉన్న మినీ డెస్క్ టాప్ స్కీన్‌లో అప్‌లోడ్ చేసినట్టు పేర్కొన్నారు. దీని తమిళ ప్రసంగాన్ని గవర్నర్ సభకు వినిపిస్తారని పేర్కొంటూ, ఇది సభా పద్దులలో నమోదు కావాలని విన్నవించారు. దీంతో స్పీకర్ అనుమతితో మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఈ తీర్మానంకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో నాలుగో సారి కూడా ఆయన ప్రభుత్వం అందించన ప్రసంగాన్ని పక్కన పెట్టారు. మంగళవారం సభ నుంచి ఆ వెంటనే వాకౌట్ చేసి బయటకు వెళ్లడమే కాకుండా, అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానించారని, తనను మాట్లాడ నివ్వకుండా మైక్ కట్ చేశారని లోక్ భవన్ ద్వారా ప్రకటనను విడుదల చేయించారు. ఇక గవర్నర్‌కు వ్యతిరేకంగా మరోమారు సీఎం స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. గవర్నర్ తీరును డీఎంకే కూటమి పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇక, గవర్నర్‌కు మద్దతుగా అన్నాడీఎంకే, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి.
గవర్నర్ ప్రసంగలోని ముఖ్యాంశాలు..
అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్
గవర్నర్ ప్రసంగాన్ని సభకు తమిళంలో స్పీకర్ అప్పావు వినిపించేందుకు సిద్ధం కాగా, అన్నాడీఎంకే, బీజేపీ, అన్బుమణి మద్దతు పీఎంకే ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు స్పీకర్ తీవ్ర ఆక్షేపణీయంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు సభలో నినాదాలు హోరెత్తాయి. అనంతరం సభ నుంచి అన్నాడీఎంకే, బీజేపీ, అన్బుమణి పీఎంకే మద్దతు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి తదితరులు గవర్నర్‌కు మద్దతుగా వ్యాఖ్య లు చేస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆ ప్రసంగంలోని అన్ని అంశాలు అసత్యాల పుట్టగా నేతలు ఆరోపించారు. ఇక, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగైతో పాటూ సీపీఎం, సీపీఐ సహా ఇతర మిత్ర పక్ష పార్టీలన్నీ గవర్నర్ తీరును ఖండిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కాగా అసెంబ్లీ తొలి రోజు సమావేశం ముగియగానే సభా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సభను 24వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈసందర్భంగా మంత్రి రఘుపతి మీడియాతో మాట్లాడుతూ, సభలో మైక్ పనిచేయలేదన్న గవర్నర్ ఆరోపణలు నిరాధారం అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గవర్నర్ ప్రసంగం పాఠంలోని అంశాలను స్పీకర్ అప్పావు వివరించారు. అందులో..
అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్
అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్
అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్
అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్


