బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాల దానం
వేలూరు: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వివరాలు.. వేలూరు సమీపంలోని సేన్‌బాక్కం నేతాజీ వీధికి చెందిన జగదీశ్వర్ భార్య సింధు(32) దంపతులు ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదిన బైకులో వెలుతుండగా రత్నగిరి సమీపంలో ఆమె శాలువా బైకు చక్రాల్లో చిక్కుకోవడంతో అదుపు తప్పి ఆమె రోడ్డుపై పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ ఈనెల 19వ తేది రాత్రి 10 గంటల సమయంలో బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్‌లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో సిందు భర్త జగదీశ్వరన్ ఆమె కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీలోని డాక్టర్‌లు కాలేయం, మూత్ర పిండాలను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి, కిడ్నీలు చైన్నెలోని అపోలో ఆసుపత్రికి, కల్లు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు సీఎంసీ ఆసుపత్రి పీఆర్‌ఓ దురై జాస్పర్ ఓ ప్రకటనలో తెలిపారు.


