30న తెరపైకి కరుప్పు పల్సర్
తమిళసినిమా: నటుడు గెత్తు దినేష్ ద్వపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కరుప్పు పల్సర్. యశో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డాక్టర్ సత్య మురళీకృష్ణన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మురళి క్రిష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎం.రాజేష్ శిష్యుడు కావడం గమనార్హం. నటుడు గెట్ టు దినేష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నటి రేష్మ వెంకట్, మదునిక హీరోయిన్గా నటించారు. ప్రిన్స్ విజయ్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో మన్సూర్ అలీ ఖాన్ ,శరవణన్ సుబ్బయ్య కలైయరసన్ ,కన్ను స్వామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కరుప్పు పల్సర్ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మధురై నేపథ్యంలో సాగే కమర్షియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటుడు గెత్తు దినేష్ మధురైకి చెందిన నలుపు గిత్తతో తిరుగుతుంటారని మరో పాత్రలో సిటీకి చెందిన యువకుడిగా నటిస్తున్నట్లు, ఈ పాత్రలో ఆయన పల్సర్ మోటార్ బైక్ లో తిరుగుతుంటారని చెప్పారు. అలాంటిది వీరిద్దరూ ఒకచోట కలుసుకోవడంతో వారి జీవితాల్లో ఏర్పడే సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. దీనికి భాస్కర్ ఆరు ముఖం ఛాయాగ్రహణంను, ఇన్బా పాటలు, సంగీతాన్ని అందించినట్లు పేర్కొన్నారు.
కరుప్పు పల్సర్ చిత్ర యూనిట్
30న తెరపైకి కరుప్పు పల్సర్


