తెన్‌పొన్నై నదిలో అన్నామలైయార్‌కు తీర్థవారి | - | Sakshi
Sakshi News home page

తెన్‌పొన్నై నదిలో అన్నామలైయార్‌కు తీర్థవారి

Jan 21 2026 6:59 AM | Updated on Jan 21 2026 6:59 AM

తెన్‌

తెన్‌పొన్నై నదిలో అన్నామలైయార్‌కు తీర్థవారి

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అన్నామలైయార్‌కు తెన్‌పొన్నై నదిలో తీర్థవారి మంగళవారం నిర్వహించారు. తమిళ తైమాసంలో ప్రతి సంవత్సరం అన్నామలైయార్‌కు సొంతమైన 180 ఎకరాల వ్యవసాయ భూమిని చూసే వైభవం నిర్వహించడం ఆనవాయితీ. ఈక్రమంలో విల్లుపురం జిల్లా నుంచి వచ్చే నది తెన్‌పొన్నై నది, సెయ్యారు నుంచి వచ్చే గౌతమి నది, మన్నార్‌పేటలో మూడు నదులు కలిసే ప్రాంతంలో అన్నామలైయార్‌కు తీర్థవారి నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉదయం చంద్రశేఖరుడిని తిరువడియాగ అన్నామలైయార్‌ను ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి భక్తుల దర్శనార్థం తిరువణ్ణామలై ఆలయం నుంచి కళశపాక్కం సెయ్యారు నది వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వార్లుకు హరోం హరా నామస్మరణాల మధ్య కర్పూర హారతులు పట్టడంతో పాటూ శాలువలు, చీరలను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ తీర్థవారిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అన్నామలైయార్‌కు హరోంహారా అంటూ పూజలు నిర్వహించారు. స్వామి వార్లు ఊరేగింపు సమయంలో భారీగా భక్త జనం పాల్గొన్నారు. తీర్థవారి అనంతరం స్వామివారు వివిధ గ్రామాలను చుట్టి రాత్రికి ఆలయానికి చేరుకుంటుందని ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరన్‌ తెలిపారు.

తెన్‌పొన్నై నదిలో అన్నామలైయార్‌కు తీర్థవారి 1
1/1

తెన్‌పొన్నై నదిలో అన్నామలైయార్‌కు తీర్థవారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement