పార్టీ మూడ్‌లో.. | - | Sakshi
Sakshi News home page

పార్టీ మూడ్‌లో..

Jan 21 2026 6:59 AM | Updated on Jan 21 2026 6:59 AM

పార్టీ మూడ్‌లో..

పార్టీ మూడ్‌లో..

తమిళసినిమా: అగ్ర కథానాయికులుగా వెలిగిపోతున్న నయనతార, త్రిష మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు తరచూ కలిసి ట్రిప్‌లకు సైతం ప్లాన్‌ చేస్తుంటారు. ఇక నయనతార అయితే దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లికి ముందు, ఆ తరువాత కూడా పండుగలు, పుట్టినరోజులు అంటూ విదేశీయానం చేస్తూంది లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇప్పుడు సరోగసీ విధానం ద్వారా కలిగిన ఇద్దరు కవల పిల్లలతో మమతానురాగాలను పొందుతున్నారు. ఇక త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమెకు మిత్ర బృందం ఎక్కువ. వారితో ఎక్కువగా పార్టీల్లో మునిగి తేలుతుంటారు. ఈ భామ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అన్నది తెలిసిందే. కాగా నాలుగు పదుల వయసు పై బడిన నయనతార, త్రిష రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కాగా వృత్తి పరంగా వీరి మధ్య పోటీ తత్వం ఉండవచ్చు. వ్యక్తిగతంగా మంచి స్నేహితులే. ఇందుకు తాజా ఉదాహరణ ఈ బ్యూటీ లిద్దరూ ఇటీవల దుబాయిలో పార్టీని జరుపుకోవడమే. నటి నయనతార తన భర్త విఘ్నేష్‌ శివన్‌ ఇటీవల దుబాయిలోనే ఉంటున్నారు. వారితో నటి త్రిష జాయిన్‌ అయ్యారు. ఇటీవల వీరు దుబాయ్‌లోని సమీర్‌ తీరప్రాంతంలో ఓ బోట్‌ లో సన్‌షైన్‌ను ఎంజాయ్‌ చేస్తూ, పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా త్రిష, నయనతార కలిసి పార్టీ మూడ్‌ లో తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వాటిని చూసిన వారు ఇదికదా లైఫ్‌ అంటే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

నయనతార, త్రిష

నయనతార, త్రిష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement