గ్రీవెన్స్‌డేకు 333 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 333 వినతులు వచ్చాయి. వాటిని తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతాప్ ఆయాశాఖలకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. గ్రీవెన్స్‌డేలో అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కాగా, కలెక్టర్ ప్రతాప్ వివిద ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పక్కా గృహాల కోసం 51 వినతులు, సాంఘిక భద్రత పథకాన్ని వర్తింప చేయాలని 70 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 78 వినతులతోపాటు 333 వినతులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేశారు. అనంతరం వికలాంగుల సంక్షేమశాఖ ఆద్వర్యంలో ఆరు మందికి 3.36 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ సురేష్, పీఏజీ వెంకట్రామన్, స్పెషల్ కలెక్టర్ బాలమురుగన్, డిప్యూటీ కమిషనర్ గణేషన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


