మహిళల కబడ్డీ పోటీలు
పళ్లిపట్టు: సంక్రాంతి పురస్కరించుకుని మహిళలకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతలకు డీఎంకే మండల కార్యదర్శి బహుమతులతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా పళ్ళిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బిడి. చంద్రన్ ఆధ్వర్యంలో మహిళల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని పలు గ్రామాల నుంచి పది జట్లు పాల్గొన్నాయి. మూడు రోజుల పాటూ నిర్వహించిన కబడ్డీ పోటీలకు అత్తిమాంజేరిపేట ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానం వేదికై ంది. రసవత్తరంగా సాగిన కబడ్డీ పోటీల్లో విజేత జట్టుకు బహుమతులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో తొలి స్థానం సాధించిన జట్టుకు రూ. 15 వేలతో పాటు ట్రోపీ అందజేసి సత్కరించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలుసాధించిన జట్లుకు రూ. పది వేలు, ఐదువేల బహుమతులతో జ్ఞాపిక అందజేసి సత్కరించారు.


