పౌల్టీర రైతుల ధర్నా
పళ్లిపట్టు: తమిళగ రైతుల సంఘం బాయిలర్ కోళ్లఫారం రైతులు ఆధ్వర్యంలో 11 అంశాలతో డిమాండ్ల పరిష్కారం కోసం పొదటూరుపేట బస్టాండులో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సంఘం చైన్నె మండల కోఆర్డినేటర్ దేవరాజ్ అధ్యక్షత వహించారు. బాలసుబ్రహ్మణ్యం నాయుడు స్వాగతం పలికారు. ఇందులో తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాలకు చెందిన బాయిలర్ కోళ్ల పారం రైతులు 30 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిపిల్లలు సరఫరా చేసే సంస్థల ప్రతినిధులపై బాయిలర్ కోళ్ల పెంపకం రైతులు దాడిచేసినట్లు తప్పుడు ఫిర్యాదుతో తమ సంఘం అధ్యక్షుడు ఈశన్ మురుగస్వామి సహా 9 మంది అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని, బాయిలర్ కోళ్ల పెంపకంకు కేజీ ధర రూ. 6.50 పెంచి రూ. 20 అందజేయాలని నినాదాలు చేశారు.


