ఉపాధ్యాయుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ఆందోళన

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

ఉపాధ్యాయుల  ఆందోళన

ఉపాధ్యాయుల ఆందోళన

మూడు వేల మంది అరెస్టు

తిరువొత్తియూరు: చైన్నెలో (మాధ్యమిక) సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు ఒక నెలగా శిబిరాల్లో వుంటూ పోరు బాట సాగిస్తున్నారు. అర్ధ సంవత్సర పరీక్షల సెలవుల్లో పోరాటం ప్రారంభించిన వారు ఇప్పుడు సంక్రాంతి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పోరాటాన్ని కొన సాగిస్తున్నారు. వేతన వ్యత్యాసాలను సరిదిద్ది సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేస్తూ చైన్నెలో వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నందున సోమవారం ఉపాధ్యాయులు పోరాటాన్ని తీవ్రతరం చేశారు. కోట రైల్వే స్టేషన్‌ సమీపంలోని పూల దుకాణం ప్రాంతంలో అకస్మాత్తుగా రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.

ఏలగిరి పర్యటనలో

పారిశ్రామిక వేత్త మృతి

తిరువొత్తియూరు: చైన్నెలోని పోరూర్‌ ప్రాంతానికి చెందిన మహేష్‌(47) పారిశ్రామిక వేత్త. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. అతను పొంగల్‌(సంక్రాంతి పండుగ) సెలవుల కోసం 2 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి కొండకు పర్యటనకు వచ్చారు. ఈ పరిస్థితిలో సోమవారం పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా, సోమవారం ఉదయం అకస్మాత్తుగా మహేష్‌కు గుండెపోటు వచ్చింది. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు అతన్ని రక్షించి చికిత్స కోసం తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement