వీనుల విందుగా విష్ణు సహస్రనామం | - | Sakshi
Sakshi News home page

వీనుల విందుగా విష్ణు సహస్రనామం

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

వీనుల విందుగా విష్ణు సహస్రనామం

వీనుల విందుగా విష్ణు సహస్రనామం

కొరుక్కుపేట: 500మందితో నిర్వహించిన విష్ణు సహస్రనామ పారాయణం వీనులవిందుగా సాగింది. శ్రీ కళారంజని చారిటబుల్‌ ట్రస్ట్‌, శ్రీ కళారంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె టినగర్‌ శ్రీరామకృష్ణ పాఠశాల ఆవరణలో ఉన్న ఇన్పోసిస్‌ హాలు వేదికగా దశ సహస్రగళార్చనలోభాగంగా ప్రత్యేక సంగీత కార్యక్రమం, భక్తిరంజని ఆథ్యాత్మిక ఆల్బమ్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు . ట్రస్ట్‌ నిర్వాహకులు , సంగీత దర్శకులు డాక్టర్‌ జే . శ్రీనిబాబు అధ్యక్షతన జరిగింది. ఇందులో ముందుగా యుఎస్‌ఏ కి చెందిన కెవిన్‌ వేల్‌ మురుగన్‌ కచ్చేరి అందరినీ వీనుల విందు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలైమామణి డాక్టర్‌ జే బాలసుబ్రమణియన్‌ , ప్రత్యేక అతిథులుగా భక్తిరత్న పివి కృష్ణారావు, గానసరస్వతి శాంతి సురేష్‌, సేవా రత్న శోభారాజా పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. ముందుగా 500మందితో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం వీనుల విందు చేసింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజలక్ష్మీ, గాయనీగాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement