రిహార్సల్స్‌ అదరహో..! | - | Sakshi
Sakshi News home page

రిహార్సల్స్‌ అదరహో..!

Jan 20 2026 7:54 AM | Updated on Jan 20 2026 7:54 AM

రిహార

రిహార్సల్స్‌ అదరహో..!

మెరీనా తీరం వద్ద రిపబ్లిక్‌ డే రిహార్సల్స్‌

సాక్షి, చైన్నె: మెరీనా తీరంలో రిపబ్లిక్‌ డే వేడుకల కసరత్తు మొదలయ్యాయి. కామరాజర్‌ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్‌ మొదలయ్యాయి. తొలి విడతగా అదరహో అనిపించారు. త్రివిధ దళాలు, ఎన్‌సీసీ కేడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్‌ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలతో ముందుకు సాగారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఈ రిహార్సల్స్‌ జరిగే సమయాలలో కామరాజర్‌ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్‌ మార్పులు జరిగాయి. మలి విడతగా బుధ, శుక్రవారాలలో రిహార్సల్స్‌కు చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలలో ప్రత్యేకంగా కర్ణాటక, రాజస్థాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనకు చర్యలు తీసుకున్నారు.

రిహార్సల్స్‌ అదరహో..!1
1/5

రిహార్సల్స్‌ అదరహో..!

రిహార్సల్స్‌ అదరహో..!2
2/5

రిహార్సల్స్‌ అదరహో..!

రిహార్సల్స్‌ అదరహో..!3
3/5

రిహార్సల్స్‌ అదరహో..!

రిహార్సల్స్‌ అదరహో..!4
4/5

రిహార్సల్స్‌ అదరహో..!

రిహార్సల్స్‌ అదరహో..!5
5/5

రిహార్సల్స్‌ అదరహో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement