కాన్‌సిటీ ఫస్ట్‌లుక్ పోస్టర్
తమిళసినిమా: తమిళంలో ఇప్పుడు వైవిధ్యభరిత కథాంశాలతో కూడిన చిన్న చిత్రాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా తాజాగా రూపొందుతున్న చిత్రం కాన్‌సిటీ. నటుడు అర్జున్‌దాస్, ప్రముఖ మలయాళ నటి అన్నాబెన్ జంటగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, వడివుక్కరసి, బాల నటుడు అఖిలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవర్‌హౌస్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరీష్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది మద్య తరగతి కుటుంబం నేపధ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందని, మంచి వినోదం కూడా చోటు చేసుకుంటుందని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని, చైన్నె, బెంగుళూరు, ముంబయి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. నగరం నేపఽథ్యంలో సాగే ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆఫీస్ బ్యాగ్‌తో నటుడు అర్జున్‌దాస్, ఆయనతో పాటు హ్యాండ్ బ్యాగ్‌తో నటి అన్నాబెన్, సూట్‌కేస్‌తో నటుడు యోగిబాబు, నటి వడివుక్కరసి, కప్పు పట్టుకుని వీల్‌చైర్‌లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న మాస్టర్ అఖిలన్ ఫొటోలతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ ఛాయగ్రహణం, శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మెజెంతా చిత్రంలో నటుడు శాంతను భాగ్యరాజ్
కాన్‌సిటీ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్


