చెంప చెళ్లుమనిపించా...
తమిళసినిమా: కథానాయికలకు వేధింపుల కథలు చాలానే ఉంటాయి. వాటి గురించి వెంటనే చెప్పకపోయినా, ఏదో ఒక సమయంలో బయట పెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. నటి తమన్నా నుంచి చాలా మంది తాము జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటి పూజా హెగ్డే చేరారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తమిళంలో విజయ్‌కు జంటగా జననాయకన్ చిత్రంలో నటించారు. పొంగల్‌కు తెరపైకి రావాల్సిన ఈ చిత్రం దురదృష్టవశాత్తు వాయిదా పడింది. ఆ మధ్య తెలుగులో వరుస విజయాలతో క్రేజీ నాయకిగా వెలిగిన పూజాహెగ్డేకు అక్కడ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం హిందీలో హై జవానీ, ఇష్క్ హోనా హై చిత్రంతోపాటు తమిళంలో కాంచన 4, తెలుగులో దుల్కర్ సల్మాన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. జననాయకన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న ఈ 35 ఏళ్ల ముంబయి భామ కథానాయకిగా పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇటీవల ఒక సమావేశంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పేర్కొంటూ కొన్నేళ్ల క్రితం ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించానని చెప్పారు. అప్పుడు ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా తన క్యారవాన్‌లోకి ప్రవేశించడమే కాకుండా అనాగరికంగా ప్రవర్తిస్తూ తనను టచ్ చేయబోయారన్నారు. దీంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని చెప్పారు. ఆ సంఘటన తరువాత ఆ హీరో తనతో కలిసి నటించలేదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చెంప చెళ్లుమనిపించా...
చెంప చెళ్లుమనిపించా...


