మెజెంతా చిత్ర టీజర్ విడుదల
తమిళసినిమా: బ్రాండ్ బ్లిట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డా.లీలారామ్, రాజు.కే, శరవణన్ బీ, రేఖా ఎల్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మెజెంతా. నవీన్‌రాజ్.కేఎస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటుడు శాంతను భాగ్యరాజ్, అంజలి నాయర్ జంటగా నటిస్తున్నారు. అర్చన రవిచంద్రన్, ఆర్‌జే.ఆనంద్, బడవా గోపి, శరత్ రవి, సౌందర్య ప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ మోహన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఇగ్లూ అనే వైవిధ్యభరిత కథా చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. చిత్ర టీజర్‌ను విడుదల చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు శాంతను భాగ్యరాజ్ ఇంతకు ముందు నటించిన చిత్రాల కంటే మెజెంతా చిత్రంలో వైవిధ్యభరిత కథా పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్రంలో ఆయన గెటప్ కొత్తగా ఉంటుందన్నారు. నటి అంజలినాయర్ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. చిత్ర టీజర్‌ను విడుదల చేయగా విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. దీంతో చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంటోందని అన్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ,చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ధరణ్‌కుమార్ సంగీతాన్ని, బల్లు ఛాయాగ్రహణంను అందిస్తున్నారు.
నటి అంజలి
నాయర్
మెజెంతా చిత్ర టీజర్ విడుదల


