అ‘పూర్వ’ కలయిక
వేలూరు: చదివిన పాఠశాలను, తల్లిదండ్రులను ఎప్పుడూ మరవరాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. వేలూరు జిల్లా లత్తేరి ప్రభుత్వ పాఠశాలలో 1986–87వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు, టీచర్ల కలయిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా 40 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదివిన పాఠశాల అభివృద్దికి సహకరించడంతో పాటు గుర్తింపుగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే తరహాలోనే ప్రతి సంవత్సరం కలుసుకోవాలని తీర్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అప్పటి టీచర్‌లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.


