కామెడీ నేపథ్యంలో మరకత వాణయం–2
తమిళసినిమా: నటుడు ఆది కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ కథా చిత్రం మరకత నాణయం. 2017లో విడుదలైనా ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు మరకత నాణయం –2 తెరకెక్కుతోంది. ఏఆర్ కే.శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్,డంగల్ టీవీ, ఆర్ డీసీ మీడియా, యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ, గుడ్ షో సంస్థల అధినేతలు సుధన్ సుందరమ్, మనీష్ సింగాల్,దుర్గా రామ్ చౌదరి, దేవ్, కేవీ.దురై కలిసి నిర్మిస్తున్నారు. నటుడు ఆది పినిశెట్టి, నటి ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, నటి నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీష్ కాంత్, ఆనంద్ రాజ్,డేనీ అరుణ్ రాజ్ కామరాజ్,మురుగానంద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిపు నినన్ థామస్ సంగీతాన్ని, పీవీ.శంకర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్లింప్సెస్‌ను విడుదల చేశారు. మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ వస్తోందనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పుడు అద్భుతమైన విజువల్స్ తో కూడిన గ్లింప్స్ విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి అంటున్నారు. చిత్ర నిర్మాతలో ఒకరైన సుధన్ సుందరమ్ పేర్కొన్నారు. ఈయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మరకత నాణయం చిత్రానికి తాను అభిమానిని అన్నారు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొదటి చిత్రానికి అంటే ఇందులో విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటారన్నారు. ఫాంటసీ , కామెడీతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కామెడీ నేపథ్యంలో మరకత వాణయం–2


