మద్యం మత్తులో వీరంగం
–ఐదుగురి అరెస్ట్
తిరుత్తణి: మద్యం మత్తులో అర్ధరాత్రి గ్రామంలోని ఇళ్లలోకి ప్రవేశించి వీరంగం సృష్టించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువలంగాడు యూనియన్‌లోని తాళవేడు గ్రామ పంచాయతీలోని ఇరుళర్ కాలనీలో 30 కుటుంబీకులు నివాశముంటున్నారు. ఆ గ్రామంలో శనివారం మద్యం మత్తులో చొరబడ్డ ఆరుగురు వ్యక్తులు ఇళ్లలో ప్రవేశించి వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు ప్రశ్నించిన కుటుంబీకులపై దాడి చేశారు. ఇందులో రామస్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లీసంఘటన ఇరుళ కాలనీ వాసులకు భయాందోళనకు గురిచేసింది. సంఘటనపై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి మురుక్కంపట్టుకు చెందిన శరవణన్(25), ఎగువ తిరుత్తణికి చెందిన కార్తిక్(19) సహా ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. కాగా మద్యం మత్తులో యువకులు గ్రామంలోని ఇళ్లలో ప్రవేశించి వీరంగం సృష్టించడంతో ఆందోళన చెందిన కుటుంబీకులను తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ఆదివారం కనేరుగా వెళ్లి పరామర్శించారు. గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి తనవంతు ఆఽర్థికసాయం అందజేసి గ్రామంలో విద్యుద్దీపాలు, తాగునీటి ఏర్పాట్లు చేస్తామని హా మీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట డీఎంకే యూనియన్ కార్యదర్శి విజయ్, అధికారులు పాల్గొన్నారు.


