తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భాషలలో ప్రచురించే ఉత్తమ రచనలకు తమిళనాడు ప్రభుత్వం తరపున ఇకపై జాతీయ స్థాయిలో సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. సెమ్మోళి (ప్రాచీన భాష) పురస్కారంగా దీనిని అందజేస్తామన్నారు. | - | Sakshi
Sakshi News home page

తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భాషలలో ప్రచురించే ఉత్తమ రచనలకు తమిళనాడు ప్రభుత్వం తరపున ఇకపై జాతీయ స్థాయిలో సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. సెమ్మోళి (ప్రాచీన భాష) పురస్కారంగా దీనిని అందజేస్తామన్నారు.

Jan 19 2026 6:14 AM | Updated on Jan 19 2026 6:14 AM

తెలుగ

తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భ

సీఎం స్టాలిన్‌ ప్రకటన

చైన్నెలో ముగిసిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన

సాక్షి, చైన్నె: చైన్నె కలైవానర్‌ అరంగం వేదికగా అంతర్జాతీయ పుస్తక ఉత్సవం ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. తమిళనాడు విద్యాశాఖ, పాఠ్యపుస్తకాల విభాగం, విద్యా సేవల కార్పొరేషన్‌ నేతృత్వంలో 44 పుస్తకాలు, పబ్లిక్‌ లైబ్రరీ డిపార్ట్‌మెంట్‌ నుంచి మరో 40 పుస్తకాలు సహా మొత్తం 84 పుస్తకాలు ఈ సందర్భంగా ప్రచురించారు. వీటిని సీఎం స్టాలిన్‌ విడుదల చేశారు. నాలుగో సంవత్సరంగా మూడు రోజుల పాటూ జరిగిన ఈ ఉత్సవానికి దేశ విదేశాలకు చెందిన పలు పబ్లిషర్లు, రచయితలు తమ ఆవిష్కరణలను కొలువు దీర్చారు. ఈ ఏడాది ఫ్రెంచ్‌, టర్కీ సాహిత్యాలు సైతం ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం, రచనలకు ప్రాముఖ్యత కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో చర్చలు, సమీక్షలు వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో మొత్తం 84 పుస్తకాలను అనువదించారు. వీటిని సీఎం స్టాలిన్‌ ముగింపు వేడుకలో ఆవిష్కరించారు. సాంస్కృతిక, సాహిత్య, పుస్తక ఉత్సవాలు, నిరంతర భాగస్వామ్యాన్ని ధృవీకరించే విధంగా టర్కీ, మలేషియా, థాయిలాండ్‌, ఫిలిప్పీన్స్‌తో తమిళనాడు ప్రభుత్వం సీఎం స్టాలిన్‌ సమక్షంలో అనువాదన , అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా జరిగిన అంతర్జాతీయ పుస్తక ఉత్సవం 2026లో 102 దేశాలతో 1,830 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. తమిళం నుండి ఇతర భాషలకు 1273 అవగాహన ఒప్పందాలు, ఇతర భాషల నుండి తమిళంకు 260 , ఇతర భాషలకు 297 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ప్రపంచానికి తమిళం, ఒక్కటే కాదు, భారతీయ భాషలను తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ఒప్పందాలు జరిగాయి. సాహిత్య మార్పిడి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికతల మధ్య సంభాషణ అనే ఉన్నత స్థాయి కార్యక్రమం లక్ష్యం నెరవేర్చే దిశగా ముందడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేశ్‌, మేయర్‌ ప్రియ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ రచనలు, ఉత్తమ సాహితీ వేత్తలను అవార్డులతో సీఎం స్టాలిన్‌ సత్కరించారు.

సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు..

తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉండడమే కాకుండా, తమిళ సంస్కృతి ,సంప్రదాయాలకు నెలవుగా ఉందని వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ రచనలను తమిళంలోకి తీసుకు రావడం ద్వారా మానవత్వం , సామాజిక న్యాయం ద్రావిడ సిద్ధాంత సాహిత్యం విజయం సాధించిందని గర్వంగా చెబుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. భాష విభజన గోడ కాదు, అది ప్రపంచ ప్రజలను కలుపుతుందన్నారు. ఇది ఒక అనుసంధాన వంతెన అని వ్యాఖ్యానిస్తూ, పుస్తకాలు కేవలం కాగితం కాదు.. అవి ఒక తరం అనేది ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే మేధో సంపత్తి అని వివరించారు. నేటి తరం ఒక పుస్తకాలు చదవడం మొదలెడితే, అందులోని ప్రతి పేజీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ఒక తెలివైన సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ప్రపంచం తమిళం కోసమే, తమిళం మన కోసమే అన్న భావన కలిగిస్తుందన్నారు. సాహితీ అకాడమీ అవార్డుల గురించి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందులో కూడా రాజకీయాల జోక్యం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే, ఇక తమిళనాడు నేతృత్వంలో ఏటా సాహితీ పురస్కారాలను జాతీయ స్థాయిలో అందించడం జరుగుతుందని ప్రకటించారు.తొలి విడతగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ ,మరాఠీ భాషలలో ప్రచురించబడిన ఉత్తమ రచనలకు సెమ్మోళి అవార్డుగా ఈ పురస్కారం అందించనున్నామన్నారు. ఈ అవార్డుతో పాటుగా రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. రచనల సాహిత్య నాణ్యత, పారదర్శక ఎంపిక వ్యవస్థను నిర్ధారించే మార్గంగా ప్రసిద్ధ రచయితలు, ప్రతి భాషకు అవార్డు గ్రహీతల ప్రత్యేక ప్యానెల్‌ నియమించనున్నామని ప్రకటించారు. ఇది రాబోయే ద్రావిడ మోడల్‌ 2. ఓ పాలనలో అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా, అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈరోడ్‌లో మహారాజు కళింగరాయన్‌ విగ్రహం, స్మారక మందిరాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు.

జాతీయ స్థాయిలో సాహితీ పురస్కారం

ఈ వేడుకలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషలలో ప్రచురించే ఉత్తమ రచనలకు ఇకపై జాతీయ స్థాయిలో పురస్కారాన్ని తమిళనాడు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. సెమ్మోళి(ప్రాచీన భాష) పురస్కారంతో పాటూ రూ. 5 లక్షలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. చైన్నెలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాలో పుస్తక ప్రదర్శనలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తున్నట్టు వివరించారు.తాజాగా జరిగిన అంతర్జాతీయ పుస్తక ఉత్సవంలో 102 దేశాల భాగస్వామ్యం మరెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ పుస్తక ఉత్సవంలో – అనువాదాలు, కాపీరైట్‌ బదిలీ తదితర వాటికి చాలా ప్రాముఖ్యత ఇచ్చామని గుర్తు చేస్తూ, ద్రావి డ ఉద్యమం అన్నది తమిళనాడును నాగరికతను తెర మీదకు తెచ్చిందన్నారు. ఈ పుస్తక ఉత్సవంలో అనేక మంది మేధావులు, రచయితలు, సాహితీ వేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారని గుర్తుచేస్తూ, ‘పుస్తకాల భవిష్యత్తు, విజన్‌, అనువాద సంబంధిత సవాళ్లపై దృష్టి పెట్టాలన్నారు. ఇది రీల్స్‌యుగం అని పేర్కొంటూ, అన్ని రకాల సంభాషణలు, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో షేర్‌చేయడం విస్తృతమైందన్నారు. సాహిత్యానికి సరిహద్దులు లేవు అని పేర్కొంటూ, ప్రపంచ స్థాయి శాసీ్త్రయ , సాహిత్యం గ్రామీణ విద్యార్థులకు సరళమైన తమిళ రచనల ద్వారా అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ తమిళ రచనలు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ తదితర భాషలలోకి అనువధించ బడ్డాయని, ఇందుకు తమ ప్రభుత్వం మరింత విస్తృతంగా నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఉత్తమ రచనలకు ఇకపై జాతీయ పురస్కారాలు

తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భ1
1/1

తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement