సీఎం స్టాలిన్ హాజరు..
ఉదయం 7 గంటల సమయంలో వాడివాసల్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి మూర్తి నేతృత్వంలో క్రీడాకారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎద్దులను హింసించబోమని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టును విజయవంతంచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఈ పోటీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలలో ఒక్కో రౌండ్‌కు సీఎం స్టాలిన్ , మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ చిత్రాలతో కూడిన పలు వర్ణాలతో కూడిన డ్రెస్ కోడ్(జెర్సీ) నెంబర్లతో క్రీడాకారులు వాడి వాసల్ వైపుగా దూసుకొచ్చారు. ఈ పోటీలను వీక్షించేందుకు చైన్నె నుంచి సీఎం స్టాలిన్ ఉదయాన్నేమదురైకు చేరుకున్నారు. ప్రత్యేక గ్యాలరీ నుంచి పోటీలను వీక్షించారు. ఎద్దులను నిలువరించిన క్రీడాకారులకు బంగారు ఉంగరాలను అందజేశారు.


