వెట్టి చాకిరి నుంచి 24 మందికి విముక్తి
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో వెట్టిచాకిరి చేస్తున్న 24 మందికి అధికారులు విముక్తి కలిగించారు. అధికారులు వారిని సొంత గ్రామాలకు పంపడానికి ఏర్పాట్లును చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కల్లంబేడు గ్రామంలో ప్రయిటు ఇటుక బట్టీ వుంది. ఇక్కడ చత్తీష్‌గడ్ రాష్ట్రానికి చెందిన 12 మంది పురుషులు, 12 మంది సీ్త్రలు బట్టీలో పనిచేస్తున్నారు. కార్మికులకు బట్టీ యజమాని సరైన మౌలిక వసతులు కార్మికులకు కల్పించలేదని తెలిసింది. దీంతో పాటు కార్మికులకు సరైన వేతనం ఇవ్వకపోగా, సంక్రాంతికి ఇంటికి పంపడానికి సైతం నిరాకరించడంతో ఆర్డీఓకు పిర్యాదులు అందాయి. ఆర్డీఓ రవిచంద్రన్, న్యాయమూర్తి నళినీదేవి, తహసీల్దార్ బాలాజి సంఘటన స్థలానికి వెళ్లి బట్టీలో వెట్టి చాకిరి చేస్తున్న 24 మందికి విముక్తి కల్పించి వారిని సొంత గ్రామాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.


