అనుమానాస్పదంగా చిరుత మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా చిరుత మృతి

Jan 18 2026 7:21 AM | Updated on Jan 18 2026 7:21 AM

అనుమానాస్పదంగా చిరుత మృతి

అనుమానాస్పదంగా చిరుత మృతి

సేలం: ధర్మపురి జిల్లా హొగ్నెకల్‌ వద్ద మగ చిరుత అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని అటవీ అధికారులు శనివారం గుర్తించారు. హొగ్నెకల్‌ అటవీ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తదితర జంతువులు ఉన్నాయి. ఇక్కడి పెన్నగరం పరిధిలో ఓ చిరుత మరణించి ఉండటాన్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారి శివకుమార్‌ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. 10 సంవత్సరాల మగ చిరుతగా గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయం అన్నది లేనప్పటికీ, అనుమానాస్పదంగా మరణించి ఉండటంతో కేసు నమోదు చేసి విచారణచేపట్టారు. పోస్టుమార్టానికి చిరుత కేళేబరాన్ని తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement