ఎంజీఆర్‌కు ఘన నివాళి
వేలూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి వేడుకలను వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. వేలూరులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు అధ్యక్షతన వేలూరు, కాట్పాడి, సత్‌వచ్చారి ప్రాంతాల్లోని ఎంజీఆర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళి అర్పించడంతో పాటు అన్నదానం చేశారు. నిరుపేదలకు పంచె, చీరలను పంచి పెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. అదేవిధంగా వేలూరు బీడీఓ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే ఐటీ విభాగం రీజనల్ కార్యదర్శి జననీ సతీష్‌కుమార్ అధ్యక్షతన కోశాధికారి మూర్తి, కార్యకర్తలు చిత్ర పటానికి పూలమాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. అదే విధంగా వేలపాడిలో ఎంజీఆర్ చిత్ర పటాన్ని ఉంచి అన్నాడీఎంకే కార్పొరేషన్ ప్రతినిధి కుప్పుస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచి పెట్టి నిరుపేదలుకు పంచె, చీరలను అందజేశారు. పాత కార్పోరేషన్ కార్యాలయంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహానికి అన్నాడీఎంకే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించి స్వీట్లు పంచి పెట్టారు.
35 ప్రధాన
రైళ్లకు అదనపు స్టాప్‌లు
కొరుక్కుపేట: అదనపు స్టాప్‌ల కోసం ఎంతో కాలంగా ప్రయాణికులు చేసిన అభ్యర్థనలు ఎట్టకేలకు నెరవేరాయి. 35 ప్రదాన రైళ్లకు అదనపు స్టాపులు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైన్నె–విజయవాడ పినాకీని ఎక్స్‌ప్రెస్, విజయవాడ జన్ చత్రపతి శివాజీ ఎక్స్‌ప్రెస్, పాపి కొండలకు మెట్రోరైలు కనెక్టివిటీ కల్పించడం వలన సెంట్రల్ రైల్వేస్టేషన్‌న్‌లో రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా, చైన్నె– కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్, చైన్నె –బెంగళూరు ఎక్స్‌ప్రెస్ తిరువళ్లూరు స్టేషన్‌న్‌లో ఆగుతాయి. చైన్నె, జోలార్‌పేటకు స్టాప్ ఇచ్చారు కానీ, ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు అదే సమయంలో అంబత్తూరులో ఆగుతుంది. చైన్నె ఎగ్మూర్ చత్రపతి శివాజీ మహరాజ్ టోమీవర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అరక్కోణంలో స్టాప్ ఇచ్చారు. దీనికి రైల్వే బోర్డు ప్రకటన జారీ చేసిందని, ఈ కొత్త స్టాప్‌ల అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మహిళపై యువకుడి దాడి
తిరువొత్తియూరు: ఇంట్లోకి చొరబడి ఓ యువకుడు మహిలపై దాడి చేశాడు. చైన్నె, కోడంబాక్కం, శివాలయం వీధికి చెందిన షర్మిల (24) భర్త కార్తీక్‌తో ఉంటోంది. కార్తీక్ కు, అతని చిన్ననాటి స్నేహితుడు అరుణ్‌ల మధ్య కొద్ది రోజుల క్రితం మనస్పర్థలు వచ్చాయి. ఈక్రమంలో షర్మిలా గత 13వ తేదీ మధ్యాహ్నం చూలైమేడు, శ్రీరామపురం మెయిన్ రోడ్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త స్నేహితుడు అరుణ్ షర్మిలా తల్లి ఇంట్లోకి చొరబడ్డాడు. షర్మిలను, ఆమె తల్లిని అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడు. దీనిపై షర్మిలా చూలైమేడు పోలీస్ స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అరుణ్‌ను అరెస్టు చేశారు. విచారణలో, కార్తీక్ అరుణ్ ప్రియురాలి వద్ద అతని గురించి తప్పుగా చెప్పినట్లు తెలిసింది. అందువల్ల, ఆమె అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, దీనికి కారణమైన కార్తీక్‌పై పగ తీర్చుకోవడానికి అరుణ్ ఈ సంఘటనకు పాల్పడినట్లు వెల్లడైంది.


