పర్యాటక ప్రాంతాల్లో కనుమ సందడి
తిరువళ్లూరు: సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమను పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారాయి. పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, పట్టణంలోని విజ్ఞాన్ పార్కు, పళవేర్కాడు, నేమం, కన్నన్‌కోటై రిజర్వాయర్‌ల వద్ద జనం కిటకిటలాడారు. ఉదయం నుంచే ప్రజలు రావడంతో సందడి నెలకొంది. పూండీ రిజర్వాయర్ వద్ద జనం రద్దీగా మారిన క్రమంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్‌లో స్నానం చేయడానికి అనుమతించలేదు. రిజర్వాయర్ వద్దకు వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. కనుమ రోజు గ్రామాల్లో ఉట్టి కొట్టడం, యువతకు వేర్వేరు పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. రాత్రి రికార్డింగ్ డాన్స్‌లు, వీధినాటకాలు సైతం నిర్వహించారు.
పర్యాటక ప్రాంతాల్లో కనుమ సందడి


