ఒకే రోజు మూడు తీర్పులు
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు సంఘటనలపై విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. తిరువళ్లూరు పట్టణంలోని పెద్దకుప్పం ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన తండ్రి మురుగన్(56), కుమారుడు రాజ్‌కుమార్(27) ఇద్దరూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై 2021వ సంవత్సరంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరిస్తూ లైంగిక దాడికి పాల్పడిన మురుగన్‌కు 22 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల అపరాధం, రాజ్‌కుమార్‌కు ఐదేళ్ల జైలుశిక్షతో రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. దీంతో పాటు బాధిత బాలికకు రూ.3లక్షల పరిహారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పుళల్ ప్రాంతానికి చెందిన దురై(50). అదే ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు 2021వ సంవత్సరంలో కేసు నమోదైంది. కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగిన క్రమంలో నిందితుడికి 7ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో సంఘటనలో చైన్నె ఎంఎండీఏ నగర్‌కు చెందిన కందన్(34). ఇతను అదే ప్రాంతంలో జిరాక్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 2010వ సంవత్సరంలో జిరాక్స్ దుకాణానికి వచ్చిన 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్టు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో జరిగింది. విచారణలో నేరం రుజువు రావడంతో నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. శిక్ష పడిన తరువాత నలురిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు.


