కోలాహలం.. ముందస్తు సంక్రాంతి సంబరాలు
తిరువళ్లూరు: ఇందిర కళాశాల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఉదయం కోలాహలంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పాండూర్‌లోని ఇందిర విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా విద్యార్థులు అధ్యాపకులతో కలసి విద్యాసంస్థల చైర్మన్, తిరువళ్లూ ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, డైరెక్టర్ ఇందిర సమత్తువ పొంగళ్లు పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్‌కేపీసీలో..
కొరుక్కుపేట: చైన్నెలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం కోలాహలంగా జరుపుకున్నారు. వేడుకలో తమిళ వారసత్వం గొప్పతనాన్ని విస్తృత శ్రేణి సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ కార్యకలాపాల ప్రదర్శనలతో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. ప్రకృతి, రైతులు, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పొంగల్ తయారీ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నిర్వహించిన వివిధ పోటీలు వేడుకలకు వన్నె తెచ్చాయి. కళాశాల కరస్పాండెంట్ చిన్ని బాలాజీ, ప్రిన్సిపల్ డాక్టర్ పీబీ వనీత, డాక్టర్ ఎంవీ నప్పిన్నై ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి. భరణికుమారి పాల్గొన్నారు.
కోలాహలం.. ముందస్తు సంక్రాంతి సంబరాలు
కోలాహలం.. ముందస్తు సంక్రాంతి సంబరాలు


