శ్రీకాంత్, శ్యామ్ హీరోలుగా దిట్రైనర్
‘నటచక్రవర్తి’
తమిళసినిమా: నటుడు శ్రీకాంత్, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ట్రైనర్. నటి పూజిత పొన్నాడి, అంజనా కీర్తి, జూనియర్ ఎంజీఆర్, వాగై చంద్రశేఖర్, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రానన్స్ ఇండియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నీలా నిర్మిస్తున్నారు. వేల్ మాణిక్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అందులో దర్శకుడు తెలుపుతూ మంచి కంటెంట్‌తో కూడిన యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. అలా మంచి గ్రిప్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ది ట్రైనర్ అని చెప్పారు. ఇందులో నటుడు శ్రీకాంత్ డాగ్ ట్రైనర్‌గా నటించినట్లు చెప్పారు. ఆయనతో పాటు లీ అనే కుక్క కీలకపాత్రను పోషించినట్లు చెప్పారు. నటుడు శ్యామ్ పోలీసు అధికారిగా నటించారని చెప్పారు. ఇది సేఫ్టీ అండ్ ఎన్ఫవర్మెంట్ ఆఫ్ ఉమెనన్ కోసం తమిళనాడు పోలీస్ డిపార్టుమెంట్ ఏర్పాటు చేసిన ది కావలన్ అనే యాప్ స్ఫూర్తితో రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో 8 హై యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అరుణ్ మొళి చోళన్ చాయాగ్రహణం, కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ది ట్రైనర్ చిత్రంలో పూజితా పొన్నాడి, శ్రీకాంత్
లక్ష్యసాధనే ధ్యేయంగా పరుసు
తమిళసినిమా: కాలక్షేపం కథా చిత్రాల మధ్య యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచే కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిది పరుసు. ఒక యువతి చిన్నతనం నుంచి సైనికదళంలో చేసి దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. పాఠశాల రోజుల నుంచి ఒక నిబద్ధతతో పయనం సాగిస్తున్న ఆ యువతికి మాజీ సైనికుడైన తండ్రి సహాయ సహకారాలు, ప్రోత్సాహం మెండుగా ఉంటాయి. చదువులో ఉత్తమ విద్యార్థి అయిన ఆ యువతి గన్‌షూట్, వ్యవసాయం, ఇతరులకు సాయం చేయడం వంటి అంశాలలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కళాశాలలో చాలా మందికి డ్రీమ్‌గర్ల్. ఈమె ప్రేమ కోసం పడిగాపులు పడేవారు చాలా మంది ఉంటారు. అయితే ప్రేమ, పెళ్లి వంటి విషయాలకు దూరంగా ఉంటూ తన లక్ష్యం వైపు పరుగులు తీసే ఆ యువతికి కళాశాల తరఫున అంతర్జాతీయ గన్‌షూట్ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. అలా పోటీల్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఒక పోలీస్ అధికారిగా హత్యకు గురైన సంఘటన ఎదురవుతుంది. కారులో వెళుతున్న ఆ పోలీస్ అధికారిని ఒక లారీ ఢీ కొట్టే వెళ్లిపోతుంది. ఆ దృశ్యం చూసిన ఆ యువతి వెంటనే తనకు పరిచయం ఉన్న పోలీస్ అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించి, అంబులెన్‌న్స్‌కు ఫోన్ చేస్తుంది. అదే ఆమెను చిక్కుల్లోకి నెడుతుంది. ఆ సమస్యల్లో నుంచి ఆమె తప్పించుకోగలిగిందా? సైనిక దళంలో చేరాలన్న తాను లక్ష్యాన్ని చేరుకోగలిగిందా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం పరుసు. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నటి జాన్విక ప్రధాన పాత్రను పోషించారు. కిరణ్ ప్రదీప్, జైబాలా,సచ్చు, మనోబాల, ఆడుగళం నరేన్ సెండ్రాయన్, రాజేంద్ర ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ కళా క్రియేషన్స్ పతాకంపై కళా అల్లూరి కథాకథనం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. ఈమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు అన్నది గమనార్హం. చిత్రానికి కథ, సంగీతం రాజేష్, చాయాగ్రహణంను శంకర్ సెల్వరాజ్, నేపథ్యసంగీతం సీవీ హమరా అదించారు.
పరుసు
చిత్రంలో
జాన్విక
తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం తీయవర్ కులై నడుంగ. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై జీ.అరుళ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్ అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, లోగు, రామ్ కుమార్, తంగదురై, బేబీ అనికా, ప్రాంక్ట్సర్ రాహుల్, ప్రియదర్శిని, జీకే రెడ్డి, పీఎల్ తేనప్పన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి భరత్ ఆశీగన్ సంగీతం, శరవణన్ అభిమన్యు చాయాగ్రహణం అందించారు. కాగా యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నెల 21వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ చట్టాన్ని మించి న్యాయం ఉంటుందని, న్యాయాన్ని మించి ధర్మం ఉంటుందని, చివరికి గెలిచేది ధర్మమేనని చెప్పే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.
తమిళసినిమా: నటుడు దుల్కర్ సల్మాన్‌కు చెందిన స్పిరిట్ స్టూడియో, నటుడు రాణా దగ్గుపాటికి చెందిన వేఫారర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం కాంత. నటుడు దుల్కర్ సల్మాన్, నటి భాగ్యలక్ష్మిబోర్సే జంటగా నటించిన ఇందులో నటుడు రాణా దగ్గుపాటి, సముద్రఖని తదితర ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు.సెల్వమణి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి జాను చందర్ సంగీతం అందించారు. పీరియడ్ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన తమిళం, తెలుగు తదితరులు భాషల్లో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుపాటి తదితర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన తాను ఒక మంచి చిత్రాన్ని చేయాలని భావించానన్నారు. ఈ కథకు దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుపాటి, సముద్రఖని వంటి ప్రముఖులు లభించడం తన అదృష్టం అని పేర్కొన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ పీరియడ్ కథా చిత్రం చేయాలన్నది తన డ్రీమ్ అన్నారు. 2019లో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథను చెప్పారన్నారు. కథ నచ్చడంతో చిత్రం చేయడానికి సమ్మతించినట్లు పేర్కొన్నారు. తాను పుట్టింది, చదివింది చైన్నెలోనేనని చెప్పారు. స్కూల్‌లో తన థర్డ్ సబ్జెక్ట్ తమిళ్ అని చెప్పారు. ఆ రోజుల్లో చైన్నెలో పలు చిత్రాల షూటింగ్స్ జరిగేవన్నారు. అలాంటి లొకేషనన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ చిత్రం టైమ్ మిషన్‌లో ఆ కాలానికి వెళ్లి వచ్చిన అనుభవాన్ని కలిగించిందన్నారు. నటుడు రాణా తాను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచే తెలుసన్నారు. ఆయనతో కలిసి ఈ చిత్రం చేయడం సంతోషకరం అన్నారు. ఆయన ప్రతి విషయం గురించి బాగా ఆలోచిస్తారని పేర్కొన్నారు. నటుడు రాణా దగ్గుపాటి మాట్లాడుతూ దర్శకుడు ఈ చిత్ర కథను తనకు 2016లోనే చెప్పారని, మంచి ప్రతిభావంతులతో కలిసి ఈ చిత్రం చేయడం మంచి అనుభవం అన్నారు. ఈ చిత్రం తరువాత దుల్కర్ సల్మాన్‌ను నట చక్రవర్తి అంటారని రాణా పేర్కొన్నారు. తమిళంలో తనకిది తొలి చిత్రం అని, మంచి చిత్రంతో పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి భాగ్యలక్ష్మి బోర్సే పేర్కొన్నారు.
నటుడు
దుల్కర్ సల్మాన్,
రాణా దగ్గుపాటి తదితర
కాంత చిత్రం
యూనిట్
దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్


