సిద్ధార్థ్‌కు జోడీగా రాశీఖన్నా | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్‌కు జోడీగా రాశీఖన్నా

Nov 23 2025 6:07 AM | Updated on Nov 23 2025 6:53 AM


వెట్ట్రి హీరోగా లక్ష్మీకాంతన్‌ కొలై వళక్కు
 

 

తమిళసినిమా: బహుభాషా నటుడు సిద్ధార్థ్‌ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రౌడీ అండ్‌ కో. ఈచిత్రంలో ఆయనకు జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఇంతకుముందు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తిరుచిట్రఫలం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన ఈమె చిన్నగ్యాప్‌ తర్వాత కోలీవుడ్లో నటిస్తున్న చిత్రం ఇది కావడం గమనార్హం. కార్తీక్‌ జి.గిరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, యోగిబాబు, రెడిన్‌కింగ్‌సీ్త్ర, ప్రాంకస్టర్‌ రాహుల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది రౌడీలా కార్పొరేట్‌ రాజ్యం గురించి సాగే కథాచిత్రంగా ఉంటుందన్నారు. అందుకే ఈ చిత్రానికి రౌడీఅండ్‌కో అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చెప్పారు. ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రం ప్రేక్షకులను కార్పొరేట్‌ ప్రపంచంలోకి తీసుకెళుతుందని అని అన్నారు. ఇప్పటికే చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాత కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు చెప్పారు. రౌడీ అండ్‌ కో చిత్రాన్ని త్వరలోనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

సిద్ధార్థ్‌

రాశీఖన్నా

తమిళసినిమా: శాంతి టాకీస్‌ పతాకంపై నిర్మాత అరుణ్‌విశ్వా ఇంతకుముందు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా మావీరన్‌, సిద్ధార్థ హీరోగా 3 పీహెచ్‌కే వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించారు. భవిష్య భరిత కథాచిత్రాలతో వరుసగా విజయం సాధిస్తున్న ఈయన ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అలా విక్రమ్‌ కథానాయకుడిగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నంబర్‌–3 చిత్రానికి రాజ్‌కుమార్‌ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా తాజాగా తన నాలుగవ చిత్ర నిర్మాణానికి అరుణ్‌ సిద్ధమయ్యారు. చిత్రంలో యూట్యూబర్‌గా పాపులర్‌ అయిన ఫైనల్లీ భారత్‌, కుటుంబస్థన్‌ చిత్రం ఫేమ్‌ శాన్వీమేఘన హీరోహీరోయిన్లుగా నటించనున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా హరిహరసుధన్‌ పరిచయంచేస్తున్నారు. కాగా ఇందులో బాలశరవణన్‌ ముఖ్యపాత్రలో నటించనున్నట్లు ఇతర నటినటులు, సాంకేతికవర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కాగా తమ గత చిత్రాల మాదిరిగానే ఈచిత్రం మంచి కథా చిత్రంగానూ, వసూళ్ల పరంగానూ మంచి విజయం సాధిస్తుందని నమ్మకాన్ని నిర్మాత అరుణ్‌విశ్వ వ్యక్తం చేశారు. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వెట్ట్రి. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లక్ష్మీకాంతన్‌ కొలై వళక్కు. 2ఎం సినిమాస్‌ పతాకంపై కె.వి శబరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దయాల్‌ పద్మనాభన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డు పొందారు. ఈచిత్రంలో శరవణన్‌, లిజియా ఆంటోని, లొల్లుసభ మారన్‌, ఇళవరసు, కవిత భారతి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది ఈ చిత్రం గురించి నిర్మాత శబరీష్‌ తెలుపుతూ తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఇతివత్తంతో ఈ చిత్రాన్ని దర్శకుడు దయాళ్‌ పద్మనాభన్‌ తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత తాను తెరకెక్కిస్తున్న తన డ్రీమ్‌ కథా చిత్రం దర్శకుడు దయాళ్‌ పద్మనాభన్‌ పేర్కొన్నారు. ఇది తమిళనాడులో జరిగిన ఒక జర్నలిస్టు హత్య ఉదంతంతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. దీని వెనక ఉన్న ప్రముఖులు ఎవరు? ఈ హత్యకు కారణాలు ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రం లక్ష్మీకాంతన్‌ కొలై వళక్కు అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చైన్నెలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఎంవీ పన్నీర్‌సెల్వం చాయాగ్రహణం, దర్పుక శివ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement