నటుడు శ్రీకాంత్, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ట్రైనర్. పూజిత పొన్నాడ (తెలుగు హీరోయిన్), అంజనా కీర్తి, జూనియర్ ఎంజీఆర్, వాగై చంద్రశేఖర్, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రాన్స్ ఇండియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నీలా నిర్మిస్తున్నారు. వేల్ మాణిక్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ది ట్రైనర్
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో కూడిన యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. అలా మంచి గ్రిప్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ది ట్రైనర్ అన్నారు. ఇందులో నటుడు శ్రీకాంత్ డాగ్ ట్రైనర్‌గా నటించినట్లు చెప్పారు. ఆయనతో పాటు లీ అనే కుక్క కీలకపాత్రను పోషించినట్లు చెప్పారు. నటుడు శ్యామ్ పోలీసు అధికారిగా నటించారని చెప్పారు.
షూటింగ్ పూర్తి
ఇది సేఫ్టీ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ కోసం తమిళనాడు పోలీస్ డిపార్టుమెంట్ ఏర్పాటు చేసిన ది కావలన్ అనే యాప్ స్ఫూర్తితో రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో హై యాక్షన్ సన్నివేశాలున్నాయన్నారు. మూవీ షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అరుణ్ మొళి చోళన్ చాయాగ్రహణం, కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు.
చదవండి: ఐదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్.. సంతోషంలో తెలుగు సీరియల్ నటి


