బుల్లితెర నటి హర్షిత వెంకటేశ్ (Harshitha Venkatesh) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా పెళ్లయిన ఐదేళ్లకు హర్షిత దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు.
ఎవరీ హర్షిత?
కన్నడ నటి హర్షిత.. తెలుగులో లక్ష్మీ కళ్యాణం, అమ్మ కోసం సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. భర్త వినయ్ శ్యామ్ సుందర్‌తో కలిసి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లోనూ పాల్గొంది. ఎన్నోసార్లు ఎలిమినేషన్ అంచులదాకా వెళ్లిన వీరు ఎంతో కష్టపడి ఎట్టకేలకు ఫినాలే చోటు దక్కించుకున్నారు. అంతేకాదు, తమ ముందున్న జంటలను ఓడించి ఏకంగా ఇస్మార్ట్ జోడీ ట్రోఫీ గెలుచుకున్నారు. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ కూడా సొంతం చేసుకున్నారు. ఈ జంట కన్నడలో రాజారాణి రీలోడెడ్ అనే షోలోనూ పాల్గొంది.
చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ


