
గిండిలో 7 అంతస్తులతో రవాణా కేంద్రం
– మూడు సేవల అనుసంధానం
సాక్షి, చైన్నె: గిండిలో ఏడు అంతస్తులో రవాణా కేంద్రం భవనం వాణిజ్య సముదాయాలతో రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. చైన్నె నగరంలో గిండి ఒక ప్రధాన ప్రాంతంగా ఉంది. రవాణాకు ఇది ఒక జంక్షన్ వలే ఉంది. ఇక్కడే మెట్రో, ఎలక్ట్రిక్, బస్సు రవాణా ఒకే చోట ఏకం అవుతాయి. ఎంటీసీ బస్సులు గిండి మీదుగా పోరూరు, పూందమల్లి వైపుగా ఓ మార్గంలో, కోయంబేడు వైపుగా మరో మార్గంలో. తాంబరం, విమానాశ్రయం వైపుగా ఇంకో మార్గంలో సేవలు సాగిస్తూ వస్తున్నాయి. నగరంలో ప్రధాన రవాణా ప్రాంతంగా ఉన్న గిండి బస్టాండ్‌ను వాణిజ్య సముదాయంతో తీర్చిదిద్దేందుకు కసరత్తు మొదలయ్యాయి. ఇప్పటికే చైన్నెలో పలు బస్టాండ్‌లను మాల్స్ తరహాలో తీర్చిదిద్దే కసరత్తులు వేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం గిండి కూడా ఆ జాబితాలో చేరింది. ఏడు అంతస్తులతో బ్రహ్మాండ భవనంగా, వాణిజ్యసముదాయాలతో, మెట్రో, ఎలక్ట్రిక్, బస్సు సేవలకు ఉపయోగకరంగా ఉండే మాల్ ఇక్కడ రూపకల్పన జరగబోతోంది.