
రూ.66.78కోట్లతో పైప్‌లైన్
తిరువళ్లూరు: చెమరంబాక్కం నుంచి కోయంబేడు వరకు తాగునీటిని తరలించడానికి రూ.66.78 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ట్రయల్‌రన్‌ను మంత్రులు నెహ్రూ, నాజర్ బుధవారం పరిశీలించారు. చెమరంబాక్కం రిజర్వాయర్ వద్ద వున్న శుద్ధీకరణ కేంద్రం నుంచి నీటిని శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈక్రమంలోనే రెండవ దశలో చెమరంబాక్కం నుంచి పూందమల్లి జంక్షన్ మీదుగా కోయంబేడు వరకు పైప్‌లైన్‌ను అమర్చారు. ఈ పైప్‌లైన్ ద్వారా కోయంబేడు, అంబత్తూరు, అన్నాఽనగర్, తేనాంపేట, కోయంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, అడయార్, తాంబరం, కుండ్రత్తూరు ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. పనులు పూర్తయిన క్రమంలో ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. ఈ ట్రయల్‌రన్‌ను మున్సిపల్‌శాఖ మంత్రి నెహ్రూ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ పరిశీలించారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ చెమరంబాక్కం శుద్ధీకరణ కేంద్రం నుంచి 11.7 కి.మీ, పూందమల్లి జంక్షన్ నుంచి 9.2 కి.మీ మేరకు పైప్‌లైన్‌లను అమర్చినట్టు తెలి పారు. దీంతో రోజుకు అదనంగా 265 మిలియన్ లీటర్ల తాగునీటిని శుద్ధీకరణ చేసి తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. కార్య క్రమంలో కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, ఆవడి మేయర్ ఉదయకుమార్, వివిధ విభా గాల అధికారులు పాల్గొన్నారు.