
చైన్నెలో బిగ్ సినీ ఎక్స్ పో
సాక్షి, చైన్నె : చైన్నె నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్ వేదికగా బిగ్ సినీ ఎక్స్ పో ప్రారంభమైంది. 8వ ఎడిషన్ సినీ ప్రదర్శన చథియేటర్ పంపిణీ పరిశ్రమకు ఆసియాలోని ఏకై క వేదికగా ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. థియేటర్ వరల్డ్ నిర్వహించిన ఈ ప్రదర్శన సింగిల్– స్క్రీన్ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ పరిశ్రమ వాటాదారులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనను తమిళనాడు సినిమా థి యేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం, థియేటర్ వరల్డ్ వ్యవస్థాపకుడు సందీప్ మిట్టల్, బిగ్ సినీ ఎక్స్ పో డైరెక్టర్ రాఘవేంద్ర, జీటీసీ ఇండస్ట్రీస్ భాగస్వామి యూసఫ్ తదితరులు బుధవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో షో ఫ్లోర్, లైవ్ టెక్నాలజీ డెమోలు, ఉత్పత్తి ప్రదర్శనలు, స్టూడియో ప్రజెంటేషన్లు, ఫిల్మ్ స్క్రీనిం గ్లు, సెమినార్లు, ప్యానల్ చర్చలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.