
భక్తితోనే పాండురంగ స్వామి అనుగ్రహం
కొరుక్కుపేట: భక్తితో పాండురంగస్వామిని వేడుకుంటే అనుకున్న కోర్కెలు తీరుతాయని బ్రహ్మశ్రీ విట్టల్ దాస్ మహరాజ్ ఉపదేశించారు. చైన్నె పెరంబూరులో మంగళవారం రాత్రి వేంకటేశ్వర భక్త సమాజం, శ్రీ కృష్ణ స్వీట్స్, రంగనాథన్ మోంట్ ఫోర్డ్ మెట్రుక్కులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకుని నామసంకీర్తనం పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు, బ్రహ్మశ్రీ విట్టల్ దాస్ మహరాజ్ పాల్గొని పాండురంగస్వామిని కీర్తిస్తూ నామసంకీర్తనం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు విట్టల్ దాస్ మహరాజ్‌తో కలిసి పాండురంగుని పాటలను పాడుతూ ఆకట్టుకున్నారు. సెక్రటరీ ఎస్.వెంకటరామన్, కోశాధికారి పి.కోదండరామయ్య, జాయింట్ సెక్రటరీ పి.రవికుమార్, పాఠశాల కరస్పాండెంట్ జనార్దనం, సీఈఓ భువనేశ్వర్, ప్రిన్సిపల్ సుదర్శనం పాల్గొని విట్టల్ మహరాజ్‌ను సత్కరించారు.