క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 10 2025 5:52 AM | Updated on Aug 10 2025 5:52 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

వ్యవసాయ ఉత్పాదక కోసం ఆవిష్కరణలు

సాక్షి,చైన్నె: రైతులకు మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత కోసం కొత్త ఆవిష్కరణలతో పరిష్కారాలను విస్తృతం చేశామని ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. భారత దేశంలో నంబర్‌ 1 ట్రాక్టర్‌ ఎగుమతి బ్రాండ్‌లో సోనాలికా 2025లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నమోదుచేసిన ట్రాక్టర్ల అమ్మకాల రికార్డుల వివరాలను శనివారం స్థానికంగా ప్రకటించారు. ఆశాజనకమైన రుతు పవనాలతో రబీ సీజన్‌లో రైతులకు మరింత తోడ్పాటు నిలిచే విదంగా ముందడుగు వేయనున్నామని తెలిపారు.

వీఐటీ– శ్రీనారాయణి ఆస్పత్రి ఒప్పందం

వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ నారాయణి ఆస్పత్రితో వేలూరు వీఐటీ యూనివర్సిటీ పరస్పర ఒప్పందం చేసుకుంది. వేలూరు వీఐటీ ప్రాంగణంలో జరిగిన ఈ ఒప్పందంలో వీఐటీ చాన్స్‌లర్‌ విశ్వనాథన్‌ అధ్యక్షతన వీఐటీ హెల్త్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం డీన్‌ గీతా మణివాసగం, శ్రీ నారాయణి ఆస్పత్రి డైరెక్టర్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ బాలాజీ ఒప్పందంపై చర్చించారు. ఈ సందర్బంగా విశ్వనాథన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ రానున్న రోజుల్లో విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వీఐటీ ఉపాధ్యక్షుడు శేఖర్‌, కార్యనిర్వహణ డైరెక్టర్‌ సంధ్య, ప్రొ చాన్స్‌లర్‌ పార్థశారథి మల్లిక్‌, శ్రీ నారాయణి ఆస్పత్రి పరిశోధన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నట్లు ప్రకటనలో తెలిపారు.

బాలికను గర్భవతిని చేసిన యువకుడు

– 20 ఏళ్ల జైలు శిక్ష

తిరువొత్తియూరు: నర్సింగ్‌ విద్యార్థిని గర్భవతిని చేసి ఆపై మోసానికి పాల్పడిన యువకుడికి పెరంబలూరు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు..పెరంబలూరు జిల్లా, లడపురానికి చెందిన పళనియాండి కుమారుడు సురేష్‌ కుమార్‌ (27) ఎంబీఏ పట్టభద్రుడు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో నర్సింగ్‌ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిని ప్రేమించి గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 22న విద్యార్థినికి కడుపునొప్పి రావడంతో సురేష్‌కుమార్‌ ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ విద్యార్థిని 7 నెలల గర్భిణి అని తెలిసింది. ఆ తర్వాత ఆమెకు మృత ఆడ శిశువు జన్మించింది. ఆరోగ్యం క్షీణించడంతో సురేష్‌ కుమార్‌ విద్యార్థినిని పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు. మృతశిశువును ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద సురేష్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. పెరంబలూరు మహిళా కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో న్యాయమూర్తి ఇందిరాణి నిందితుడు సురేష్‌కుమార్‌కు 20 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు.

లిఫ్ట్‌ ఇస్తామని దోపిడీ

తిరువొత్తియూరు: లిఫ్టు కోసం బైక్‌ ఎక్కిన కార్మికుడిపై దాడి చేసి అతని నగదు చోరీ చేసిన రౌడీని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. ఐనావరం ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ (24) కూలీ. ఇతను పని ముగించుకుని మధురవాయల్‌ సమీపంలోని పూందమల్లి హైవేలో కోయంబేడు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, అదే దారిలో మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ’లిఫ్ట్‌’ ఇస్తామని చెప్పి తంగరాజ్‌ను మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని రోహిణి థియేటర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టి, తంగరాజ్‌ వద్ద వున్న ఖరీదైన సెల్‌ఫోన్‌, రూ.350 నగదు, ఏటీఎం. కార్డును లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తంగరాజ్‌ కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి వచ్చి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోయంబేడు బస్‌ స్టేషన్‌ పోలీసులు ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా దశ్యాలను పరిశీలించగా, తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన రౌడీ ప్రదీప్‌రాజ్‌ తన అనుచరులతో కలిసి దోపిడీ చేసి పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ప్రదీప్‌రాజ్‌ను అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

బైకులు చోరీ:

ఇద్దరు యువకుల అరెస్టు

తిరువొత్తియూరు: చైన్నె చాకలిపేట పరిసర ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె, చాకలి పేట ప్రాంతానికి చెందిన ఆరుముగం (64) కాయలాంగడై (పాత ఇనుప వస్తువులు కొనుగోలు దుకాణం) నడుపుతున్నాడు. ఈనెల 2వ తేదీన తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు నిలిపి, కొద్దిసేపటి తర్వాత వచ్చి చూశాడు. ఆ సమయంలో తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో చోరీ చేసినట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు బైక్‌ చోరీ చేసిన పాత చాకలి పేటలోని ఎన్‌.ఎన్కార్డన్‌ 8వ వీధికి చెందిన కార్తీక్‌రాజా (25), 3వ వీధికి చెందిన విక్రమ్‌ (22)ని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కార్తీక్‌రాజా తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి చాకలి పేట, దాని పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. కార్తీక్‌ రాజాపై ఇప్పటికే 7 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement